Chennur: కిష్టంపేట డిగ్రీ కళాశాలలో రూ. 1.50 కోట్ల పనులు ప్రారంభం

Chennur: కిష్టంపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో రూ. 1.50 కోట్ల అభివృద్ధి పనులను ప్రారంభించిన మంత్రి వివేక్, ఎంపీ వంశీకృష్ణ. చెన్నూరును ఎడ్యుకేషన్ హబ్‌గా మారుస్తామని వెల్లడి.

RAJENDER, CHENNUR
Published on: 19 Aug 2026 6:42 PM IST
Chennur
X

Chennur: కిష్టంపేట డిగ్రీ కళాశాలలో రూ. 1.50 కోట్ల పనులు ప్రారంభం

చెన్నూరు: చెన్నూరు నియోజకవర్గంలో కార్మిక, మైనింగ్ శాఖ మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి, పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ విస్తృత స్థాయిలో పర్యటించారు. చెన్నూరు మండలంలోని కిష్టంపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో రూ. 1.50 కోట్ల నిధులతో పలు అభివృద్ధి పనులను ప్రారంభించిన మంత్రి వివేక్, ఎంపీ వంశీకృష్ణ.

డిగ్రీ కళాశాలలో అదనపు తరగతి గదులు, ఆధునిక సైన్స్ ల్యాబ్‌లు, డిజిటల్ లైబ్రరీ, తాగునీటి సదుపాయాల కల్పనకు ప్రత్యేక నిధులను కేటాయిచారు. చెన్నూరు నియోజకవర్గాన్ని విద్యా హబ్‌గా తీర్చిదిద్దుతామని, ప్రభుత్వ విద్యా సంస్థలను కార్పొరేట్ స్థాయిలో బలోపేతం చేస్తామని మంత్రి వివేక్ వెంకటస్వామి స్పష్టం చేశారు.

గ్రామీణ ప్రాంత విద్యార్థులకు నాణ్యమైన ఉన్నత విద్యను చేరువ చేయడమే లక్ష్యమన్న ఎంపీ వంశీకృష్ణ; స్థానిక సమస్యలను నేరుగా తెలుసుకుంటూ అధికారులకు తక్షణ ఆదేశాలు జారీచేశారు. విద్యార్థులకు మెరుగైన వసతులు, నాణ్యమైన విద్యా బోధన అందించేందుకు ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందని పేర్కొన్నారు.

వంశీ సార్ కామెంట్స్....!

ఈరోజు కిష్టంపేట డిగ్రీ కళాశాలలో కోటి యాభై లక్షల రూపాయల నిధులతో కళాశాల భవన పనులు పూర్తి చేసుకున్నాము. సమాజంలో విద్యార్థుల బాధ్యత కీలకమైనది. విద్యార్థులు కష్టపడి చదువుకోవాలని. విద్యార్థులు అందరూ ఒక పాషన్, గోల్ ఎంచుకొని దానిని సాధించుకోవాలి తెలిపారు.

విద్యార్థులు బాగా చదివి ఇంటర్న్షిప్ ప్రోగ్రాములకు వెళ్ళి నైపుణ్యాలు సాధించుకోవాలి, విద్యార్థులు అందరూ బాగా కష్టపడి చదివి ఉన్నత స్థాయిలో ఉండాలి, కళాశాలలో ఏమైనా కార్యక్రమాలు ఉన్నపుడు నన్ను ఆహ్వానిస్తే నేను వచ్చి నా వంతు సహాయ సహకారాలు అందిస్తానని తెలిపారు.

గత ప్రభుత్వం విద్యావిధానం పైన దృష్టి సారించలేదు. ఈరోజు మంత్రి వివేక్ గారు మంచిర్యాల జిల్లా విద్యాభివృద్ధిలో ఉన్నత స్థానంలో ఉండాలని కృషి చేస్తున్నారని అన్నారు.

వివేక్ సార్ కామెంట్స్...!

నేను అసెంబ్లీ ఎన్నికల తర్వాత ఈ డిగ్రీ కళాశాల కి రావడం జరిగింది, అప్పుడు ఈ కళాశాలలో త్రాగునీటికి ఇబ్బందిగా ఉందని ఒక బోర్వెల్ కావాలని కోరారు, వెంటనే స్పందించి త్వరితగతిన ఒక బోర్వెల్ వేయించడం జరిగింది తెలిపారు. కళాశాలలో సదుపాయాలు బాగా లేవు ఒకసారి పర్యవేక్షించాలని ప్రిన్సిపాల్ కోరారు.

ఇక్కడ కళాశాలలో చూస్తే పరిస్థితులు చాలా అధ్వాన్నంగా ఉన్నాయి. గత ప్రభుత్వాలు విద్యా వ్యవస్థను పట్టించుకున్న పాపాన పోలేదని మండిపడ్డారు. అప్పుడు ఈ డిగ్రీ కళాశాలకు వచ్చాక, ఇక్కడ ఎన్నో అభివృద్ధి పనులు జరిపించాలని నేను అనుకున్నాను.

వెంటనే కోటి యాభై లక్షల రూపాయల నిధులు మంజూరు చేయడం జరిగింది, కళాశాలలో పలు అభివృద్ధి కార్యక్రమాలను వెంటనే పూర్తి చేస్తామని తెలిపారు. ఇంత మంచిగా కళాశాలను తీర్చిదిద్దుకున్నాం కాబట్టి విద్యార్థులు బాగా చదువుకోవాలని, ఇక్కడ కళాశాలలో మంచిగా చదివిన విద్యార్థులకు మంచి బహుమతి అందిస్తామని తెలిపారు.

విద్యార్థులు చదువును ఒక పాషన్, పట్టుదలతో చదువుకొని ఉన్నత శిఖరాలు సాధించుకోవాలి. నేను మంత్రిగా ఉన్నందుకు మన నియోజకవర్గంలో 2 ఏటీసీ సెంటర్ లను ఏర్పాటు చేసుకున్నాము. ఏటీసీ సెంటర్ లలో కొత్త నైపుణ్యాలు నేర్పించి ఉద్యోగ అవకాశాలు కల్పించడం జరుగుతుందని పేర్కొన్నారు.

యువత ఎవరైనా ఎస్సై, కానిస్టేబుల్ పోస్టులు సాధించాలని ఉంటే కాకా వెంకటస్వామి ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఫ్రీ కోచింగ్ సెంటర్ ను సద్వినియోగం చేసుకోవాలి. చెన్నూరు నియోజకవర్గంలో విద్యా రంగంలో ఎక్కువ నిధులు ఇవ్వాలని నిర్ణయం తీసుకోవడం జరిగిందని పేర్కొన్నారు.

250 కోట్ల రూపాయల నిధులతో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది. మా నాన్నా కాకా వెంకటస్వామి, అన్నయ్య వినోద్ ఉన్నప్పుడు అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో బెంచీలు ఇవ్వడం జరిగింది. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక విద్యా వ్యవస్థను పటిష్టం చేయడానికి నిధులు మంజూరు చేయడం జరుగుతుంది. విద్యార్థులు బాగా చదువుకొని మంచి ఉద్యోగాలు సాధించుకొని మీ అమ్మ నాన్నను గర్వపడేలా ఉండాలి ఆకాంక్షిస్తున్నట్టు తెలిపారు.

RAJENDER, CHENNUR

RAJENDER, CHENNUR

Next Story