Chennur: కాంగ్రెస్ పాలన వైఫల్యాలపై బీఆర్ఎస్ భారీ నిరసన ర్యాలీ
Chennur: చెన్నూరులో కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలపై బీఆర్ఎస్ శ్రేణులు నిరసన తెలిపారు. 1000 రోజుల్లో హామీలు అమలు చేయలేదని మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ మండిపడ్డారు.
Chennur: కాంగ్రెస్ పాలన వైఫల్యాలపై బీఆర్ఎస్ భారీ నిరసన ర్యాలీ
చెన్నూరు: పట్టణంలో బిఆర్ఎస్ శ్రేణుల నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపుమేరకు రాష్ట్రవ్యాప్తంగా టిఆర్ఎస్ శ్రేణులు నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. చెన్నూరు మాజీ ఎమ్మెల్యే, మంచిర్యాల జిల్లా బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు బాల్క సుమన్ ఆధ్వర్యంలో చెన్నూరు పట్టణంలో భారీ నిరసన ర్యాలీనీ చేపట్టారు.
కాంగ్రెస్ పార్టీ 1,000 రోజుల ప్రజాపాలన లో విఫలమైందని, కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన కార్యక్రమాలు చేపట్టారు. కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఎన్నికల్లో ఇచ్చిన 6 గ్యారంటీలు, 420 హామీలు నెరవేర్చలేదని కాంగ్రెస్ ప్రభుత్వానికి, సీఎం రేవంత్ రెడ్డి కి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ర్యాలీని నిర్వహించి నిరసన తెలిపారు.
ప్రజలకు ఇస్తానని ఇవ్వలేని గ్యారంటీలు హామీలను ఫ్లెక్సీ ద్వారా ప్రదర్శించి నిరసన వ్యక్తం చేశారు. బిఆర్ఎస్ పార్టీ అప్పులు చేసి అభివృద్ధి చేసిందని కానీ కాంగ్రెస్ పార్టీ అప్పులు చేసి జేబులు నింపుకుంటుందని ఎద్దేవా చేశారు. గత బిఆర్ఎస్ ప్రభుత్వంలో తెలంగాణ రాష్ట్రాన్ని అప్పుల గొప్పగా మార్చారని కాంగ్రెస్ ప్రభుత్వం ఆరోపిస్తోంది కానీ టిఆర్ఎస్ పార్టీ అప్పులు చేసి అభివృద్ధి చేసిందని కానీ కాంగ్రెస్ పార్టీ అప్పులు చేసి జేబులో నింపుకుంటుందని ఎదవ చేశారు.
గత బిఆర్ఎస్ ప్రభుత్వంలో రాష్ట్రవ్యాప్తంగా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామని, కాలేశ్వరం ప్రాజెక్టు, ప్రతి జిల్లాలో అధునాతన కలెక్టరేట్లు, అన్ని వసతులతో కూడిన 100 పడకల ఆసుపత్రులు, గ్రామాలలో బ్రిడ్జిలు, రోడ్డు రవాణా వ్యవస్థ అభివృద్ధి వంటి పలు అభివృద్ధి కార్యక్రమాలు చేశామని ఈ సందర్భంగా వివరించారు.
రాష్ట్ర ప్రజలకు ఇస్తానన్న హామీలు ఇవ్వకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ, కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలు, గ్యారెంటీ లను నెరవేర్చలేదని ఈ సందర్భంగా బాకీ కార్డులను విడుదల చేశారు. ఈ బాకీ కార్డులను ప్రతి ఊర్లో ప్రతి ఇంట ప్రజలకు అందేలా చూడాలని కార్యకర్తలకు సూచించారు.
చెన్నూరు నియోజకవర్గం లో 40 వేల ఉద్యోగాలు ఇస్తామని మంత్రి వివేక్ ఎన్నికల్లో ఇచ్చిన హామీని మరిచిపోయి, మాట తప్పారని మండిపడ్డారు. చెన్నూరులో ఉపాధి కల్పిస్తానని ఇప్పుడు మంత్రి వివేక్ జర్మనీ జపాన్లో ఉపాధి కల్పించడం ఏంటని ఎద్దేవా చేశారు.
బాల్క సుమన్ మాట్లాడుతూ....!
వెయ్యి రోజుల పాలనలో రైతులకు అడ్డగోలు హామీలు ఇచ్చి విఫలమైంది. రాష్ట్ర ప్రజలందరినీ నమ్మించి ఆరు గ్యారంటీలు అని చెప్పి అమలు చేయలేదు. ముఖ్యమంత్రి హైదారాబాద్ లో హైడ్రా పేరిట పేదల ఇండ్లు కులగొడుతున్నడు. సింగరేణి కార్మికులకు వారసత్వ ఉద్యోగాలు ఇస్తామని ఇవ్వకుండా కుంభకోణాలు చేస్తున్నారు.
18 ఏండ్లు నిండిన ప్రతి అమ్మాయిలకు స్కూటీలు ఇస్తా అన్నారు ఇవ్వలేదు. వృద్ధులు, వికలాంగులకు 4000 పెన్షన్లు ఇస్తామని ఇవ్వలేదు. ఇక్కడ మంత్రి 40 వేల ఉద్యోగాలు ఇస్తా అన్నాడు ఇవ్వలేదు. రాష్ట్రంలో రెండు లక్షల రుణ మాఫీ అవుతదని కాంగ్రెస్ పార్టీనీ నమ్మి ఓటు వేస్తే రైతుల భూములను నిషేధిత జాబితాలో పెట్టారు
ఒక్క చెన్నూరు మండలంలో 704 సర్వే నంబర్లలోనే 812 ఎకరాల భూమిని నిషేధిత జాబితాలో పెట్టారు. రెండు లక్షల ఉద్యోగాలు బాకీ పడ్డారు. ఇక్కడి పోలీసులైతే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అయ్యారు. రాష్ట్రం మొత్తం ఎవరు ప్రశ్నించిన పోలీసులు అక్రమ కేసులు పెట్టడం బెదిరించడం జైల్లో పెట్టడం.
ముఖ్యమంత్రి మన సొమ్ముతో దేశాలు తిరుగుతున్నారు కానీ మనకేం చేస్తున్నారు. రేవంత్ రెడ్డి హైదరాబాదులో హైడ్రా పేరుతో ఇండ్లు కూలగొడతాడు ఇక్కడి రోడ్డు విస్తరణ పేరుతో మంత్రి చెన్నూరులో ఇండ్లు కొడతాడు. మంత్రి ఇక్కడ ముప్పు ప్రాంతాలకు కరకట్టలు కడతావని హామీ ఇచ్చి ఎందుకు కట్టడం లేదు.
పెండింగులో ఉన్న అభివృద్ధి త్వరగా పూర్తి చేయండి లేక పోతే రాబోయే రోజుల్లో BRS పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తాం. ఇప్పటికైన మొద్దు నిద్ర వీడి అభివృద్ధి పనులు చేయండి లేదంటే వచ్చే ఎన్నికల్లో ప్రజలు బుద్ధి చెప్తారు.




