Asifabad: వన్యప్రాణులను పర్యావరణాన్ని కాపాడాలి కంపా సీసీఎఫ్ క్షితిజ!

Asifabad: కొమరం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ (టి) గురుకుల పాఠశాలలో వనమహోత్సవం. అడవులు, వన్యప్రాణుల సంరక్షణపై కంపా సీసీఎఫ్ క్షితిజ ఐ.ఎఫ్.ఎస్ పిలుపు.

LALITH KUMAR, SIRPUR
Published on: 25 Aug 2026 1:13 PM IST
Asifabad
X

Asifabad: వన్యప్రాణులను పర్యావరణాన్ని కాపాడాలి కంపా సీసీఎఫ్ క్షితిజ!

Asifabad: అడవులను, వన్యప్రాణులను సంరక్షించి విద్యార్థులు పర్యావరణ పరిరక్షణకు కృషి చేయాలని కంపా సీసీఎఫ్ క్షితిజ ఐ.ఎఫ్.ఎస్ పేర్కొన్నారు. కొమరం భీం జిల్లా సిర్పూర్(టి) లోని సాంఘిక సంక్షేమ రెసిడెన్షియల్ బాలికల పాఠశాలలో జరిగిన వనమహోత్సవం కార్యక్రమంలో పాల్గొన్నారు.

విద్యార్థులు చదువుతో పాటు ఆటపాటల్లో రానించి గొప్ప స్థానాల్లో స్థిరపడాలని ఆమె ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఆమెతో పాటు ఎఫ్డిపీటీ శాంతారాం ఐ.ఎఫ్.ఎస్, ఎఫ్డివో భార్గవ్ కుమార్ ఐ.ఎఫ్.ఎస్, డా. అప్పయ్య ఏ.సీ.ఎఫ్, వేణుబాబు ఏ.సీ.ఎఫ్, ఎఫ్ఆర్ఓ లు శ్రీనివాస్, లక్ష్మీనారాయణ, సిర్పూర్(టి) సర్పంచ్ శ్రీమతి నాగమణి నానయ్య, పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు, అటవీశాఖ సిబ్బంది పాల్గొన్నారు.

LALITH KUMAR, SIRPUR

LALITH KUMAR, SIRPUR

Next Story