Bellampally: బెల్లంపల్లి సీఎస్‌ఐ పాఠశాలలో పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం

Bellampally: మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి సీఎస్‌ఐ హైస్కూల్‌లో ఘనంగా జరిగిన 1984-85 బ్యాచ్ పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం, గురువుల సన్మానం.

Kola Venkatesh, Staff Reporter -Mancherial
Published on: 27 July 2026 6:41 PM IST
Bellampally
X

Bellampally: బెల్లంపల్లి సీఎస్‌ఐ పాఠశాలలో పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం

బెల్లంపల్లి: సి.ఎస్.ఐ హై స్కూల్‌లో పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలోని సి.ఎస్.ఐ హై స్కూల్‌లో ఎస్‌ఎస్‌సీ 1984–85 బ్యాచ్ పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం ఆదివారం ఉదయం ఘనంగా నిర్వహించారు.

సుమారు నాలుగు దశాబ్దాల తర్వాత ఒకే వేదికపై కలుసుకున్న పూర్వ విద్యార్థులు ఆనందాన్ని వ్యక్తం చేశారు. పాఠశాల రోజులను, గురువుల బోధనను, చిన్ననాటి మధుర జ్ఞాపకాలను నెమరువేసుకున్నారు. ఒకరినొకరు ఆప్యాయంగా పలకరించుకుని పాత స్నేహాలను గుర్తు చేసుకున్నారు.

ఈ సందర్భంగా తమకు విద్యాబుద్ధులు నేర్పిన ఉపాధ్యాయులను ఘనంగా సన్మానించి కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించి, జ్ఞాపికలను అందజేసుకున్నారు. ఇలాంటి సమ్మేళనాలు స్నేహబంధాలను మరింత బలోపేతం చేస్తాయని పూర్వ విద్యార్థులు పేర్కొన్నారు. కార్యక్రమంలో పూర్వ విద్యార్థులు, ఉపాధ్యాయులు, వారి కుటుంబ సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Kola Venkatesh, Staff Reporter -Mancherial

Kola Venkatesh, Staff Reporter -Mancherial

11 ఏళ్ల జర్నలిజం అనుభవం కలిగిన సీనియర్ పాత్రికేయుడు. రాజకీయాలు, సామాజిక అంశాలు, స్థానిక సమస్యలు మరియు ప్రత్యేక కథనాలపై విస్తృతంగా పనిచేస్తూ ప్రజలకు ఖచ్చితమైన, విశ్వసనీయమైన వార్తలను అందిస్తున్నారు.

Next Story