Bellampalli: బెల్లంపల్లిలో 5 ఎకరాల ప్రభుత్వ భూమి కబ్జా కౌన్సిలర్ ఫిర్యాదు

Bellampalli: బెల్లంపల్లి 3వ వార్డులో 5 ఎకరాల ప్రభుత్వ భూమి కబ్జాపై గ్రీవెన్స్‌లో సబ్ కలెక్టర్‌కు కౌన్సిలర్ బెడ్డల సౌజన్య విజయ్ కుమార్ ఫిర్యాదు.

PRATHAP, BELLAMPALLI
Published on: 27 July 2026 10:44 PM IST
Bellampalli
X

Bellampalli: బెల్లంపల్లిలో 5 ఎకరాల ప్రభుత్వ భూమి కబ్జా కౌన్సిలర్ ఫిర్యాదు

బెల్లంపల్లి: 3వ వార్డ్ పరిధిలోని సర్వే నంబర్ 170/పిపి 5 ఎకరాల ప్రభుత్వ భూమిని కొంతమంది బడానేతలు కబ్జా చేసి, ప్లాట్లుగా వాటాలు వేసి అమ్ముతున్నారని కౌన్సిలర్ శ్రీమతి బెడ్డల సౌజన్య విజయ్ కుమార్ గారు ఆరోపించారు.

కబ్జాదారులు ఆ భూమిలో సరిహద్దులు కూడా ఏర్పాటు చేసుకున్నారని, దీనివల్ల ప్రభుత్వానికి, వార్డ్ అభివృద్ధికి తీవ్ర నష్టం కలుగుతుందని తెలిపారు.

ఈ రోజు గ్రీవెన్స్ సెల్ లో బెల్లంపల్లి సబ్ కలెక్టర్ గారికి వ్రాతపూర్వక ఫిర్యాదు అందజేసిన కౌన్సిలర్ గారు, "సర్వే నంబర్ 170/పిపి ప్రభుత్వ భూమిని వెంటనే సరిహద్దులతో సహా తొలగించి ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలి. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలి" అని డిమాండ్ చేశారు. ప్రభుత్వ ఆస్తిని కాపాడే వరకు పోరాటం ఆగదని కౌన్సిలర్ గారు స్పష్టం చేశారు.

PRATHAP, BELLAMPALLI

PRATHAP, BELLAMPALLI

Next Story