Bellampalli: బెల్లంపల్లిలో బీఆర్ఎస్ నిరసన ప్రజావాణిలో ఎంపీడీవోకు వినతిపత్రం!
Bellampalli: కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ బెల్లంపల్లి ఎంపీడీవో కార్యాలయంలో ప్రజావాణిలో వినతిపత్రం సమర్పించిన బీఆర్ఎస్ నాయకులు.
Bellampalli: బెల్లంపల్లిలో బీఆర్ఎస్ నిరసన ప్రజావాణిలో ఎంపీడీవోకు వినతిపత్రం!
Bellampalli: బెల్లంపల్లిలో ఎంపీడీవో కార్యాలయంలో ప్రజావాణిలో వినతి పత్రం అందజేసిన బి ఆర్ఎస్ పార్టీ నాయకులు.
కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలని ఈ రోజున బిఆర్ఎస్ పార్టీ నాయకులు ఎంపీడీవో కార్యాలయంలో ప్రజా వానిలో MPDO కి వినతి పత్రం.
ఎంపీడీవోకి ఫిర్యాదు చేసిన అనంతరం టిఆర్ఎస్ పార్టీ నాయకులు మాట్లాడుతూ. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఇన్ని రోజులైనా ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో ఘోరంగా విఫలమైంది. గతంలో కేసీఆర్ గారి ప్రభుత్వ హయాంలో ప్రజలు సుఖసంతోషాలతో ఉంటే, రేవంత్ రెడ్డి గారు 6 గ్యారెంటీల పేరుతో, 420 హామీలతో ప్రజలను మభ్యపెట్టి అధికారంలోకి వచ్చారు.
వంద రోజుల్లోనే అన్ని హామీలు అమలు చేస్తామని గొప్పలు చెప్పిన నాయకులు, నేడు వందల రోజులు గడిచినా ఒక్క హామీని కూడా సంపూర్ణంగా నెరవేర్చలేకపోయారు. ప్రజలు ఆశగా ఎదురుచూస్తుంటే ప్రభుత్వం మాత్రం ప్రజల సమస్యలను పూర్తిగా గాలికొదిలేసింది. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి ఆదేశాల మేరకు, స్థానిక నాయకత్వ సూచనల ప్రకారం మేము ప్రజా సమస్యలపై అధికారులకు వినతిపత్రం అందజేశాం.
ప్రస్తుతం ప్రభుత్వం 22A నిషేధిత జాబితా పేరుతో పేద ప్రజల పట్టా భూములు, పరంపోకు భూములు, ఎన్నో ఏళ్లుగా అనుభవిస్తున్న భూములను చేర్చి ప్రజలను తీవ్ర మానసిక క్షోభకు గురిచేస్తోంది. చదువుకునే విద్యార్థినులకు స్కూటీలు ఇస్తామని, తులం బంగారం అందజేస్తామని, పింఛన్లను రెండు వేల నుంచి నాలుగు వేలకు పెంచుతామని చెప్పి ఇప్పుడు మొహం చాటేశారు.
కేవలం ఉచిత బస్సు ప్రయాణం ఒక్కటే అమలు చేసి చేతులు దులుపుకుంటే సరిపోదు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చే వరకు బీఆర్ఎస్ పక్షాన ప్రజల తరపున పోరాటం కొనసాగిస్తూనే ఉంటాం, లేనిపక్షంలో ప్రజలే ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెప్పడానికి సిద్ధంగా ఉన్నారనీ తెలియజేశారు.




