Bellampalli: మూడేళ్ల చిన్నారిపై అఘాయిత్యం నిందితుడు అరెస్ట్

Bellampalli: బెల్లంపల్లి శాంతి గని బస్తీలో మూడేళ్ల పాపపై అఘాయిత్యానికి పాల్పడిన నిందితుడు కిష్టయ్యను పోలీసులు అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు.

PRATHAP, BELLAMPALLI
Published on: 5 Sept 2026 9:30 PM IST
Bellampalli
X

Bellampalli: మూడేళ్ల చిన్నారిపై అఘాయిత్యం నిందితుడు అరెస్ట్

బెల్లంపల్లి: మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణం శాంతి గని బస్తికి చెందిన కంపల కిష్టయ్య (46) అనే వ్యక్తి అదే బస్తికి చెందిన మూడు సంవత్సరాల బాలికపై అత్యాచారం చేసినట్లు స్థానికులు పోలీసులకు తెలపడంతో పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని జరిగిన సంఘటనపై ఆరా తీసి నిందితుని అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

నిందితున్ని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.. నిందితుడు ఇంటి పక్క ఇల్లు కావడంతో పాప తరచూ అతని వద్దకు వెళ్లి ఆడుకుంటుందని.. అయితే పాప తరచూ అతని వద్దకు వచ్చి ఆడుకుంటున్న విషయాన్ని ఆసరాగా తీసుకొని ఈ అఘాయిత్యానికి పాల్పడ్డాడని స్థానికులు వెల్లడించారు.

PRATHAP, BELLAMPALLI

PRATHAP, BELLAMPALLI

Next Story