Bellampalle: జీవో 97ను రద్దు చేయాలని పాలిటెక్నిక్ విద్యార్థుల నిరసన

Bellampalle: బెల్లంపల్లి ప్రభుత్వ పాలిటెక్నిక్ విద్యార్థులు జీవో 97ను వ్యతిరేకిస్తూ నిరసనకు దిగారు.

PRATHAP, BELLAMPALLI
Published on: 3 Sept 2026 5:18 PM IST
Bellampalle
X

Bellampalle: జీవో 97ను రద్దు చేయాలని పాలిటెక్నిక్ విద్యార్థుల నిరసన

బెల్లంపల్లి: బెల్లంపల్లి ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల విద్యార్థులు ప్రభుత్వ జీవో 97ను తీవ్రంగా వ్యతిరేకిస్తూ నిరసనకు దిగారు. పాలిటెక్నిక్ కళాశాలలను అభివృద్ధి పేరుతో ‘శక్తి’ స్కీమ్‌లో విలీనం చేసి, పబ్లిక్-ప్రైవేట్ భాగస్వామ్యం వైపు తీసుకువెళ్లడం వల్ల భవిష్యత్తులో ఫీజులు పెరిగి పేద, మధ్యతరగతి విద్యార్థులకు డిప్లొమా విద్య భారం అవుతుందని ఆందోళన వ్యక్తం చేశారు.

ఇప్పటికే ప్రవేశపెట్టిన కొత్త బ్రాంచ్‌లకు ల్యాబ్‌లు, మౌలిక వసతులు కల్పించకుండా విలీనం పేరిట విద్యార్థుల భవిష్యత్తుతో ఆడుకోవద్దని హెచ్చరించారు. ప్రభుత్వం విడుదల చేసిన జీవో 97ను వెంటనే వెనక్కి తీసుకోవాలని, అంతవరకు తమ పోరాటం ఆగదని విద్యార్థినులు స్పష్టం చేశారు.

PRATHAP, BELLAMPALLI

PRATHAP, BELLAMPALLI

Next Story