Bellampalle: మున్సిపల్ కార్యాలయం ఎదుట వ్యక్తి ఆందోళన అధికారుల దౌర్జన్యం
Bellampalle: బెల్లంపల్లిలో మున్సిపల్ అధికారుల తీరును నిరసిస్తూ బాధితుడు గౌస్ మున్సిపల్ కార్యాలయం ఎదుట నిరసన తెలిపారు.
Bellampalle: మున్సిపల్ కార్యాలయం ఎదుట వ్యక్తి ఆందోళన అధికారుల దౌర్జన్యం
బెల్లంపల్లి: బెల్లంపల్లి బస్తీ 19వ వార్డులో తన పెద్ద కుమారుడి పేరున ఉన్న స్థలానికి మున్సిపల్ పొజిషన్ సర్టిఫికెట్, పన్ను రసీదులు, కరెంట్ మీటర్ వంటి అన్ని పత్రాలతో పాటు కోర్టు ఉత్తర్వులు ఉన్నప్పటికీ మున్సిపల్ అధికారులు దౌర్జన్యంగా వ్యవహరించారని బాధితుడు గౌస్ ఆవేదన వ్యక్తం చేశారు.
మున్సిపల్ కమిషనర్, టౌన్ ప్లానింగ్ అధికారులు ఎలాంటి ముందస్తు నోటీసులు ఇవ్వకుండా, పత్రాలను పరిశీలించకుండా స్థానిక పోలీసుల సహకారంతో జేసీబీలతో వచ్చి తమ కుటుంబ సభ్యులను భయభ్రాంతులకు గురిచేసి నిర్మాణాన్ని కూల్చివేశారని వాపోయారు.
పట్టణంలో ఎకరాల కొద్దీ ప్రభుత్వ భూములు కబ్జా అవుతున్నా పట్టించుకోని అధికారులు, స్థానిక నేతల ఒత్తిళ్లతో పేదవాడైన తనపైనే ప్రతాపం చూపించారని ఆరోపించారు. తమ వద్ద అన్ని ఆధారాలు ఉన్నాయని, ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి న్యాయం చేయాలని, లేనిపక్షంలో మున్సిపల్ కార్యాలయం ఎదుటే ఆత్మహత్య చేసుకుంటామని హెచ్చరిస్తూ ఆయన నిరసన వ్యక్తం చేశారు.




