Bellampalle: బ్రాహ్మణులకు స్థలం కేటాయించాలని కలెక్టర్‌కు వినతి

Bellampalle: బెల్లంపల్లిలో గోశాల, వేద పాఠశాల నిర్మాణానికి స్థలం కేటాయించాలని కోరుతూ మంచిర్యాల కలెక్టర్ కుమార్ దీపక్‌కు బ్రాహ్మణ సేవా సమితి వినతి పత్రం అందజేసింది.

PRATHAP, BELLAMPALLI
Published on: 7 Sept 2026 7:53 PM IST
Bellampalle
X

Bellampalle: బ్రాహ్మణులకు స్థలం కేటాయించాలని కలెక్టర్‌కు వినతి

బెల్లంపల్లి: బెల్లంపల్లి బ్రాహ్మణ సేవా సమితి ఆధ్వర్యంలో మంచిర్యాల జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ కు ప్రజావాణిలో బ్రాహ్మణులకు స్థలం కేటాయించాలని వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా బ్రాహ్మణ సేవా సమితి అధ్యక్షులు వి.ఎల్.ఎస్. శ్రీనివాసరావు మాట్లాడుతూ బెల్లంపల్లి మండలంలో దాదాపు 300 కుటుంబాలపైగా బ్రాహ్మణులు నివసిస్తున్నారని ఏదైనా కార్యక్రమాలు నిర్వహించాలంటే చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు.

ప్రభుత్వం తమ విజ్ఞప్తిని పరిశీలించి స్థలాన్ని కేటాయించాలని కోరారు. బ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో గౌషాల,వేద పాఠశాల,యజ్ఞశాల నిర్మాణంతోపాటు వేద గాయత్రీ మాత ఆలయం నిర్మాణం చేపట్టాలని సంకల్పించారని తెలిపారు. ఇట్టి విషయమై ఇది వరకు మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య తో పాటు ప్రస్తుత ఎమ్మెల్యే గడ్డం వినోద్ కు వినతి పత్రం సమర్పించినట్టు తెలిపారు.

ఈ విషయంలో సానుకూలంగా స్పందించిన కలెక్టర్ తమ విజ్ఞప్తిని ప్రభుత్వం దృష్టికి తీసుకెళతానని తెలిపారు. ఈ కార్యక్రమంలో బీఎస్ఎస్ ప్రత్యేక సలహాదారు కొమ్మెర లక్ష్మణ్ సభ్యులు జగన్మోహన్,మనోజ్ పాండే, చిమిరాల శ్రీనివాస్,దత్తాత్రేయ రావు,సత్యనారాయణ, మహేష్ శర్మ, భజరంగ్ కొలరియాలు పాల్గొన్నారు.

PRATHAP, BELLAMPALLI

PRATHAP, BELLAMPALLI

Next Story