Bejjur: రేషన్ బియ్యం వ్యవహారం బెజ్జూర్ ఎస్సై ఎస్పీ ఆఫీస్‌కు అటాచ్!

Bejjur: బెజ్జూర్ ఎస్సై సర్తాజ్ పాషా ఎస్పీ ఆఫీస్‌కు అటాచ్. రేషన్ బియ్యం వ్యాపారుల వద్ద వసూళ్ల ఆరోపణల నేపథ్యంలో పోలీసు ఉన్నతాధికారుల కఠిన చర్యలు.

SRINIVAS, KOUTALA
Published on: 13 Sept 2026 11:10 AM IST
Bejjur
X

Bejjur: రేషన్ బియ్యం వ్యవహారం బెజ్జూర్ ఎస్సై ఎస్పీ ఆఫీస్‌కు అటాచ్!

Bejjur: కొమురం భీం జిల్లా హెచ్‌ఎంటీవీ వరుస కథనాల ప్రభావంతో బెజ్జూర్ ఎస్సై సర్తాజ్ పాషాపై అధికారులు చర్యలు చేపట్టారు. బెజ్జూర్ పోలీస్ స్టేషన్ బాధ్యతల నుంచి ఎస్సైని తప్పించి జిల్లా ఎస్పీ కార్యాలయానికి అటాచ్ చేస్తూ అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు.

రేషన్ బియ్యం వ్యవహారంలో అక్రమాలకు పాల్పడ్డారనే ఆరోపణలపై ఇప్పటికే జిల్లా ఎస్పీ విచారణకు ఆదేశించారు. రెండు రోజులుగా హెచ్‌ఎంటీవీలో వరుస కథనాలు ప్రసారం కావడంతో శాఖాపరమైన చర్యలకు అధికారులు సిద్ధమైన నేపథ్యంలో తాజాగా ఎస్పీ కార్యాలయానికి అటాచ్ చేశారు.

తదుపరి ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు సస్పెన్షన్‌ వేటు పడుతుందా..? లేదా మరిన్ని శాఖాపరమైన చర్యలు ఉంటాయా..? అన్నది తేలాల్సి ఉంది.

బెజ్జూర్ పోలీస్ స్టేషన్‌లో పనిచేసే సమయంలో పీడీఎస్ బియ్యం వ్యాపారుల నుంచి నెలనెలా వసూళ్లకు పాల్పడ్డారనే ఆరోపణలు రావడంతో ఈ వ్యవహారం జిల్లాలో హాట్‌టాపిక్‌గా మారింది. దీనికి సంబంధించి ఫోన్ సంభాషణ ఆడియోతో పాటు డబ్బుల లావాదేవీలకు సంబంధించిన ఆధారాలు అధికారుల దృష్టికి వెళ్లినట్లు సమాచారం.

మరోవైపు ఇదే వ్యవహారంలో మరింత లోతుగా విచారణ కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. ఆరోపణలు ఎదుర్కొంటున్న మరో హెడ్ కానిస్టేబుల్‌ను కూడా ములుగు జిల్లాకు బదిలీ చేసినట్లు సమాచారం. దీంతో పోలీస్ శాఖలో అక్రమ వ్యవహారాలపై ఉన్నతాధికారులు మరింత కఠినంగా వ్యవహరిస్తారా అన్న చర్చ జరుగుతోంది.

SRINIVAS, KOUTALA

SRINIVAS, KOUTALA