Asifabad: గణేష్ మండపాల రిజిస్ట్రేషన్ తప్పనిసరి: చింతలమానేపల్లి ఎస్ఐ

Asifabad: గణేష్ మండపాల నిర్వాహకులు పోలీస్ పోర్టల్‌లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలని, సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి నిబంధనలు పాటించాలని చింతలమానేపల్లి ఎస్ఐ తెలిపారు.

SRINIVAS, KOUTALA
Published on: 13 Sept 2026 3:53 PM IST
Asifabad
X

Asifabad: గణేష్ మండపాల రిజిస్ట్రేషన్ తప్పనిసరి: చింతలమానేపల్లి ఎస్ఐ

Asifabad: కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా ఎస్పీ నితికా పంత్,ఐపీఎస్ ఆదేశాల మేరకు కాగజ్ నగర్ డీఎస్పీ కౌటాల సిఐ సంతోష్ కుమార్ సూచనల పర్యవేక్షణలో వినాయక చవితి సందర్భంగా జిల్లాలో వినాయక మండపాల నిర్వాహకులు కింది సూచనలు తప్పనిసరిగా పాటించాలని చింతలమానేపల్లి ఎస్ఐ కమలాకర్ తెలిపారు.

వినాయక విగ్రహాన్ని ప్రతిష్ఠించే ప్రతి ఒక్కరూ తమ గణేష్ మండపం పేరును తెలంగాణ పోలీస్ పోర్టల్‌లో నమోదు చేసుకోవడంతో పాటు పోలీస్ స్టేషన్‌లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి అని ఆయన అన్నారు.

ప్రతి గణేష్ మండపం నిర్వాహకులు సీసీ కెమెరాలను ఏర్పాటు చేసి, నిరంతర పర్యవేక్షణకు చర్యలు తీసుకోవాలి అని తెలిపారు.

విగ్రహ ప్రతిష్ఠాపనకు ముందే సురక్షితమైన విద్యుత్ వైరింగ్ ఏర్పాటు చేసుకోవాలి అని షార్ట్ సర్క్యూట్లు, విద్యుత్ ప్రమాదాలను నివారించేందుకు నాణ్యమైన విద్యుత్ తీగలు పరికరాలను మాత్రమే ఉపయోగించాలి అని కోరారు.

పర్యవేక్షణ, సమన్వయం కోసం నిర్వాహకుల తరఫున కనీసం ఇద్దరు బాధ్యతగల వ్యక్తులు 24×7 మండపం వద్ద అందుబాటులో ఉండాలి అని అన్నారు.

గణేష్ మండపాల వద్ద డీజేలు, అధిక శబ్దంతో కూడిన సౌండ్ సిస్టమ్‌లకు అనుమతి లేదు.

నిర్వాహకులు స్థానిక గస్తీ పోలీస్ సిబ్బందితో నిరంతరం సమన్వయం చేసుకుంటూ ఏవైనా అనుమానాస్పద కార్యకలాపాలు సంఘటనలు లేదా శాంతిభద్రతలకు సంబంధించిన సమస్యలు గుర్తించిన వెంటనే సమాచారం అందించాలి అని తెలిపారు.

వినాయక చవితి ఉత్సవాలను ప్రశాంతంగా, భక్తిశ్రద్ధలతో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా నిర్వహించేందుకు నిర్వాహకులు సహకరించాలని ఎస్ఐ కమలాకర్ కోరారు.

https://policeportal.tspolice.gov.in/index.htm

SRINIVAS, KOUTALA

SRINIVAS, KOUTALA