Asifabad: కౌటాల మండలంలో వృద్ధురాలపై దాడి చేసి బంగారం దొంగిలించిన మనుమడు అరెస్ట్
Asifabad: కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కౌటాల మండలం తలోడి గ్రామంలో వృద్ధురాలిపై దాడి చేసి బంగారం గొలుసు అపహరించిన మనుమడిని, అతనికి సహకరించిన బావను పోలీసులు అరెస్ట్ చేశారు.
Asifabad: కౌటాల మండలంలో వృద్ధురాలపై దాడి చేసి బంగారం దొంగిలించిన మనుమడు అరెస్ట్
ఆసిఫాబాద్: కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కౌటాల మండలం తలోడి గ్రామంలో 21.08.2026న తెల్లవారుజామున 3 గంటల సమయంలో కొంపరి గౌరక్క (70) ఇంటి కిటికీలోని ఇటుకలను తొలగించి లోనికి ప్రవేశించిన నిందితుడు, వృద్ధురాలిపై దాడి చేసి ఆమె మెడలోని అర తులం కుతికట్టు బంగారు గొలుసును దొంగిలించాడు.
బాధితురాలి కుమారుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు, ప్రధాన నిందితుడు మరియు బాధితురాలి మనుమడు కొంపరి రాము (25), అతనికి సహకరించిన అతని బావ సంచికాల సతీష్‌ను అరెస్ట్ చేశారు.
దొంగిలించిన బంగారు గొలుసును గోదావరిఖనిలోని మణప్పురం ఫైనాన్స్‌లో కుదవ పెట్టినట్లు దర్యాప్తులో వెల్లడైంది. ఇద్దరూ వచ్చిన డబ్బును చెరిసగం పంచుకున్నట్లు పోలీసులు తెలిపారు. నిందితులను గౌరవ మెజిస్ట్రేట్ ముందు హాజరుపరిచి నట్లు తెలిపిన సిఐ సంతోష్ కుమార్




