Kagaznagar: కాగజ్‌నగర్‌లో 187వ ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవ వేడుకలు!

Kagaznagar: కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్‌నగర్‌లో 187వ ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవం ఘనంగా జరిగింది.

LALITH KUMAR, SIRPUR
Published on: 19 Aug 2026 4:33 PM IST
Kagaznagar
X

Kagaznagar: కాగజ్‌నగర్‌లో 187వ ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవ వేడుకలు!

కాగజ్‌నగర్‌: కొమరంభీం జిల్లా కాగజ్‌నగర్‌ పట్టణంలోని 187 వ ప్రపంచ ఫోటో గ్రాఫీ పురస్కరించుకొని పట్టణంలోని లక్ష్మీ డిజిటల్ కలర్ ల్యాబ్ నందు ఫోటో గ్రాఫీ పితామహుడు లూయిస్ డ్యాగురె చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించి TGPVWA సంఘం జెండా ఎరగవేశారు అనంతరం ప్రపంచ ఫోటో గ్రాఫి సందర్భంగా కేక్ కటింగ్ కార్యక్రమం నిర్వహించారు.

ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవం సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ఫోటో వీడియో గ్రాఫర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మొట్టమొదటిసారిగా జెండా ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించడం ఎంతో గర్వకారణంగా ఉందని యూనియన్ సభ్యులు అన్నారు.

ప్రపంచానికి మన జ్ఞాపకాలను, సంస్కృతిని, చరిత్రను చిత్రాల రూపంలో అందించే ప్రతి ఫోటోగ్రాఫర్‌కు ఈ రోజు ప్రత్యేకమైనది. ఈ జెండా ఆవిష్కరణ మన ఫోటోగ్రాఫర్ల ఐక్యతకు, గౌరవానికి, వృత్తి అభివృద్ధికి ప్రతీకగా నిలవాలి.

ఫోటోగ్రఫీ వృత్తి మరింత ఉన్నత స్థాయికి ఎదగాలి, ఫోటోగ్రాఫర్ల ఐక్యత చిరస్థాయిగా నిలవాలి కోరారు. ఇ కార్యక్రమం లో కాగజ్‌నగర్‌ ఫోటో వీడియో గ్రాఫర్స్ అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు.

LALITH KUMAR, SIRPUR

LALITH KUMAR, SIRPUR

Next Story