Veldanda: పుట్టినరోజున పాఠశాలకు బెంచీలు విరాళంగా ఇచ్చిన యువకుడు

Veldanda: నాగర్ కర్నూల్ జిల్లా కొట్ర ప్రాథమిక పాఠశాలకు తన పుట్టినరోజు సందర్భంగా నారమల్ల సందీప్ 4 సిమెంట్ బెంచీలను విరాళంగా అందజేశారు.

SRI SAILAM, KALWAKURTHY
Published on: 24 Aug 2026 4:43 PM IST
Veldanda
X

Veldanda: పుట్టినరోజున పాఠశాలకు బెంచీలు విరాళంగా ఇచ్చిన యువకుడు

వెల్దండ: నాగర్ కర్నూల్ జిల్లా వెల్దండ మండలం కొట్ర గ్రామంలోని ప్రాథమిక పాఠశాలలో యువకుడు నారమల్ల సందీప్ తన పుట్టినరోజు సందర్భంగా విద్యార్థుల సౌకర్యార్థం నాలుగు సిమెంట్ బెంచీలను విరాళంగా అందజేశారు.

ఈ సందర్భంగా నారమల్ల సందీప్ మాట్లాడుతూ.. పాఠశాలకు ఎప్పుడు, ఏ విధమైన సహాయ సహకారాలు అవసరమైనా తన వంతు సహాయం అందిస్తానని తెలిపారు.

ఈ కార్యక్రమంలో సర్పంచ్ శారద చెన్నయ్య, ఉప సర్పంచ్ అన్నమ్మ రాములు, వార్డు సభ్యురాలు సంధ్య జంగయ్య, నాయకులు శ్రీను, అరవింద్, ప్రధానోపాధ్యాయులు లక్ష్మణ్, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

SRI SAILAM, KALWAKURTHY

SRI SAILAM, KALWAKURTHY

Next Story