Nagarkurnool: పేస్‌మేకర్ ఇన్ఫెక్షన్‌కు యశోద వైద్యుల విజయవంతమైన చికిత్స

Nagarkurnool: ఆరు నెలల్లో నాలుగు సర్జరీలు చేసినా తగ్గని తీవ్రమైన పేస్‌మేకర్ ఇన్ఫెక్షన్‌కు సోమాజిగూడ యశోద ఆస్పత్రి వైద్యులు విజయవంతంగా చికిత్స అందించారు.

GUNTI SAILU SAGAR, NAGAR KURNOOL
Published on: 13 Sept 2026 7:22 PM IST
Nagarkurnool
X

Nagarkurnool: పేస్‌మేకర్ ఇన్ఫెక్షన్‌కు యశోద వైద్యుల విజయవంతమైన చికిత్స

నాగర్ కర్నూల్: యశోద హాస్పిటల్ సోమాజిగూడ వారు నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఆరు నెలల్లో నాలుగు సర్జరీలు చేయించుకున్నా తగ్గని పేస్‌మేకర్ ఇన్ఫెక్షన్‌కు విజయవంతంగా చికిత్స అందించినట్టు తెలిపారు. పదేపదే ఇన్ఫెక్షన్ రావడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న రోగి కుటుంబం చివరకు యశోద హాస్పిటల్స్‌ను ఆశ్రయించినట్టు తెలిపారు.

రోగి గత చికిత్సలను సమగ్రంగా పరిశీలించిన ప్రముఖ కార్డియాలజిస్ట్ డా. జగదీశ్ మాడిరెడ్డి ఇన్ఫెక్షన్‌కు అసలు కారణాన్ని గుర్తించి ప్రత్యేక చికిత్సా ప్రణాళిక రూపొందించారన్నారు. చికిత్స అనంతరం రెండేళ్లుగా పేస్‌మేకర్ ఇన్ఫెక్షన్ తిరిగి రాకపోవడంతో రోగి పూర్తిగా కోలుకుని సాధారణ జీవితం గడుపుతున్నట్లు తెలిపారు.

పేస్‌మేకర్ ఇన్ఫెక్షన్‌ వస్తే సమస్య క్లిష్టంగా మారే అవకాశం ఉందని డా. జగదీశ్ తెలిపారు. ఇన్ఫెక్షన్‌ను నియంత్రించడం, సరైన ప్రణాళికతో చికిత్స అందించడం కీలకమన్నారు. చిన్నదిగా కనిపించే వైద్య ప్రక్రియల్లోనూ మొదటి నుంచే సరైన నిర్ణయం, ఖచ్చితమైన అమలు అవసరమని చెప్పారు. ఈ సందర్భంగా నిర్వహించిన మీడియా సమావేశంలో పుల్లారెడ్డి హాస్పిటల్ మేనేజర్ సాయిబాబా, యశోద హాస్పిటల్స్ మేనేజర్ ఉమేశ్ పాల్గొన్నారు.

GUNTI SAILU SAGAR, NAGAR KURNOOL

GUNTI SAILU SAGAR, NAGAR KURNOOL