Wanaparthy: మొబైల్ ఫోన్ల రికవరీ మేళా.. బాధితులకు ఎస్పీ హ్యాండోవర్!

Wanaparthy: జిల్లా పోలీస్ కార్యాలయంలో మొబైల్ రికవరీ మేళా! పోగొట్టుకున్న రూ.65 లక్షల విలువైన 236 మొబైల్ ఫోన్లను బాధితులకు అందజేసిన జిల్లా ఎస్పీ సునీతా రెడ్డి.

S.NAGESH, WANAPARTHY
Published on: 24 July 2026 4:59 PM IST
Wanaparthy
X

Wanaparthy: మొబైల్ ఫోన్ల రికవరీ మేళా.. బాధితులకు ఎస్పీ హ్యాండోవర్!

​చోరీ,పోగొట్టుకున్న దాదాపు 65 లక్షల విలువగల 236మొబైల్ ఫోన్లు, బాధితులకు అందజేసిన జిల్లా ఎస్పీ శ్రీమతి సునిత రెడ్డి...

​వాయిస్ ఓవర్

​ఎస్పీ సునీతా రెడ్డి మాట్లాడుతూ..సీసీఎస్ సీఐ పవార్ అశోక్ కుమార్ ఆధ్వర్యంలో కొత్తకోట, వనపర్తి, ఆత్మకూరు సబ్-డివిజన్ల నుండి 10 మంది అధికారులతో 3 ప్రత్యేక రికవరీ బృందాలుగా ఏర్పడి

​నెల రోజు వ్యవధిలో శ్రమించి, వివిధ రాష్ట్రాల నుండి 65 లక్షల విలువైన 236 మొబైల్ ఫోన్లను రికవరీ చేశామని తెలిపారు.​ఈ ఏడాది ఇప్పటివరకు వనపర్తి జిల్లా పోలీసులు బాధితులకు మొత్తం 500 మొబైల్ ఫోన్లను తిరిగి అందజేశారు.ప్రజల కష్టార్జితమైన ఆస్తిని కాపాడడమే కాకుండా, వారి నమ్మకాన్ని నిలబెట్టుకోవడం పోలీసుల బాధ్యత అని ఎస్పీ పేర్కొన్నారు.

​కేంద్ర ప్రభుత్వ డిపార్ట్‌మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్ (DOT) అందుబాటులోకి తెచ్చిన CEIR పోర్టల్ ద్వారా సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి ఈ ఫోన్లను గుర్తించినట్లు తెలిపారు.

​ ఫోన్ పోగొట్టుకున్నవారు వెంటనే www.ceir.gov.in పోర్టల్‌లో నమోదు చేయాలి లేదా సమీప పోలీస్ స్టేషన్‌ను సంప్రదించాలని తెలిపారు.రసీదు (Bill) లేకుండా సెకండ్ హ్యాండ్ ఫోన్లు కొనకూడదు. దొంగిలించిన ఫోన్లు అని తెలిసీ కొనుగోలు చేస్తే వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని ఎస్పీ హెచ్చరించారు.అనంతరం ​ఫోన్ల రికవరీలో ప్రతిభ కనబరిచిన సీసీఎస్ సీఐ పవార్ అశోక్ కుమార్, ఎస్సైలు హెడ్ కానిస్టేబుళ్లు కానిస్టేబుళ్లకు ఎస్పీ క్యాష్ రివార్డులు అందజేసి అభినందించారు.

బైట్:- సునీతా రెడ్డి

వనపర్తి జిల్లా ఎస్పీ

S.NAGESH, WANAPARTHY

S.NAGESH, WANAPARTHY

Next Story