Pebberu: పెబ్బేరు చెరువులో భారీ మొసలి ప్రత్యక్షం

Pebberu: వనపర్తి జిల్లా పెబ్బేరు చెరువు కట్టపై సంచరిస్తున్న భారీ మొసలి. భయాందోళనలో స్థానికులు. అటవీ అధికారులు స్పందించి పట్టుకోవాలని విజ్ఞప్తి.

G. BALAVARDHAN, PEBBERU
Published on: 12 Aug 2026 11:07 PM IST
Pebberu
X

Pebberu: పెబ్బేరు చెరువులో భారీ మొసలి ప్రత్యక్షం

పెబ్బేరు: వనపర్తి జిల్లా పెబ్బేరు చెరువులో భారీ మొసలి కనిపించడంతో స్థానికుల్లో భయాందోళన నెలకొంది. చెరువు కట్ట సమీపంలోని చిన్న గడ్డిమైదానంపై మొసలి సంచరిస్తుండగా, అటుగా వెళ్తున్న ఓ బాటసారి తన కెమెరాలో దృశ్యాలను చిత్రీకరించాడు.

చెరువు పరిసరాల్లో పశువులు, ప్రజలు తరచూ సంచరిస్తుండటంతో ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందోనని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మొసలి చెరువులోకి వెళ్లడం, మళ్లీ కట్టపైకి రావడం గమనించినట్లు స్థానికులు చెబుతున్నారు.

భారీ మొసలి సంచారంతో చెరువు పరిసర ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరుతున్నారు. అటవీ శాఖ అధికారులు వెంటనే స్పందించి మొసలిని సురక్షితంగా పట్టుకుని, జనావాసాలకు దూరంగా ఉన్న ప్రాంతానికి తరలించాలని స్థానికులు విజ్ఞప్తి చేస్తున్నారు.

మొసలిని బాటసారి కెమెరాలో చిత్రీకరించిన వీడియో ప్రస్తుతం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది.

G. BALAVARDHAN, PEBBERU

G. BALAVARDHAN, PEBBERU

Next Story