Wanaparthy: వనపర్తిలో పరుగులు తీసిన యువత.. 2కే రన్‌లో సందడి చేసిన కలెక్టర్

Wanaparthy: వనపర్తిలో ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక వారోత్సవాల్లో భాగంగా జిల్లా క్రీడల శాఖ ఆధ్వర్యంలో 2కే రన్ నిర్వహించారు.

S.NAGESH, WANAPARTHY
Published on: 18 May 2026 12:07 PM IST
Wanaparthy
X

Wanaparthy: వనపర్తిలో పరుగులు తీసిన యువత.. 2కే రన్‌లో సందడి చేసిన కలెక్టర్

Wanaparthy: క్రీడల పట్ల రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రాధాన్యత ఇస్తూ... క్రీడలు, క్రీడాకారుల అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తోందని వనపర్తి జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి పేర్కొన్నారు. 99 రోజుల ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా వనపర్తి బాలుర జూనియర్ కళాశాల మైదానం నుంచి బస్ డిపో మీదుగా ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల మైదానం వరకు యూత్ మరియు స్పోర్ట్స్ వారోత్సవాల సందర్భంగా జిల్లా యువజన మరియు క్రీడల శాఖ అధికారి సుధీర్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన 2K రన్ లో ఉత్సాహంగా పాల్గొన్న అధికారులు యువకులు, ఈ 2K రన్ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి ముఖ్యఅతిథిగా హాజరై అదనపు ఎస్పీ రాజేష్ మీనాతో కలిసి జెండా ఊపి రన్ ప్రారంభించారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. 99 రోజుల ప్రజా పాలనలో భాగంగా యువజన మరియు క్రీడల వారోత్సవాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. క్రీడల పట్ల ప్రభుత్వం ఎంతో ప్రాధాన్యత ఇస్తూ, క్రీడల అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తోందని అన్నారు. ప్రతి ఒక్కరి జీవితంలో క్రీడలు ఒక భాగంగా మారాలని సూచించారు. శారీరకంగా ఆరోగ్యంగా ఉంటే మానసికంగా కూడా ఆరోగ్యంగా ఉంటామని, అందరూ ఫిట్‌నెస్‌ను కాపాడుకోవాలని పిలుపునిచ్చారు. అనంతరం వనపర్తి జిల్లాలో బాక్సింగ్ స్పోర్ట్స్ క్యాంప్‌ను జిల్లా కలెక్టర్ ప్రారంభించారు. యువత క్రీడల్లో రాణించి ఉన్నత స్థాయికి చేరుకోవాలని ఆకాంక్షించారు.

S.NAGESH, WANAPARTHY

S.NAGESH, WANAPARTHY

Next Story