Veldanda: వెల్దండ తహసీల్దార్ కార్తీక్ కుమార్‌కు ఘన సన్మానం!

Veldanda: ఉత్తమ తహసీల్దార్ అవార్డు గ్రహీత కార్తీక్ కుమార్‌ను చేర్కూర్ గ్రామ సర్పంచ్ బచ్చలకూర శ్రీనివాసులు ఆధ్వర్యంలో తహసీల్దార్ కార్యాలయంలో ఘనంగా సన్మానించారు.

SRI SAILAM, KALWAKURTHY
Published on: 18 Aug 2026 8:14 PM IST
Veldanda
X

Veldanda: వెల్దండ తహసీల్దార్ కార్తీక్ కుమార్‌కు ఘన సన్మానం!

వెల్దండ: నాగర్ కర్నూల్ జిల్లా వెల్దండ మండలం ఉత్తమ తాసిల్దార్ అవార్డు పొందిన కార్తీక్ కుమారు ను మంగళవారం మండల తాసిల్దార్ కార్యాలయంలో చేర్కూర్ గ్రామ సర్పంచ్ బచ్చలకూర శ్రీనివాసులు ఆధ్వర్యంలో తాసిల్దారును పూలమాల శాలువాలతో ఘనంగా సన్మానించారు.

ఈ సందర్భంగా సర్పంచ్ శ్రీనివాసులు మాట్లాడుతూ ప్రజలకు అంకితభావంతో సేవలు అందిస్తూ, ఉత్తమ అధికారిగా గుర్తింపు పొందడం అభినందనీయమని కొనియాడారు. భవిష్యత్తులో కూడా ఇదే విధమైన సేవా నిరతిని కొనసాగించాలని ఆకాంక్షించారు.

​అనంతరం తాసిల్దార్ మాట్లాడుతూ.. తన సేవలను గుర్తించి అవార్డు అందించడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. ప్రజా సమస్యల పరిష్కారానికి పారదర్శకంగా కృషి చేస్తానని,ఈ గుర్తింపు తనపై బాధ్యతను మరింత పెంచిందని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో మాజీ ఎంపిటిసి భీమయ్య గౌడ్,ఉప సర్పంచ్ కొండల్, వార్డు మెంబర్లు పురుగుల లాలయ్య, సామ కుమారస్వామి, గొర్రె జంగయ్య, కేశమోని జంగయ్య తదితరులు పాల్గొన్నారు.

SRI SAILAM, KALWAKURTHY

SRI SAILAM, KALWAKURTHY

Next Story