Veldanda: ఉత్తమ తహసీల్దార్ అవార్డు గ్రహీత కార్తీక్ కుమార్‌కు ఘన సన్మానం!

Veldanda: స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఉత్తమ సేవా అవార్డు అందుకున్న వెల్దండ మండల తహసీల్దార్ కార్తీక్ కుమార్‌ను ప్రముఖ సంఘ సేవకులు పాపిశెట్టి రాము, స్థానిక ప్రజాప్రతినిధులు ఘనంగా సన్మానించారు.

SRI SAILAM, KALWAKURTHY
Published on: 21 Aug 2026 7:05 PM IST
Veldanda
X

Veldanda: ఉత్తమ తహసీల్దార్ అవార్డు గ్రహీత కార్తీక్ కుమార్‌కు ఘన సన్మానం!

వెల్దండ: ఆగస్టు 15 స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఉత్తమ సేవలకు గాను అవార్డు అందుకున్న వెల్దండ మండల తహసీల్దార్ కార్తీక్ కుమార్ ప్రముఖ సంఘ సేవకులు ఆర్యవైశ్య రాష్ట్ర నాయకులు కౌన్సిలర్ పాపిశెట్టి రాము రామన్న మిత్ర మండలి సభ్యులు శ్రీను నాయక్ ప్రజాప్రతినిధులు కలిసి ఘనంగా శాలువాతో సన్మానించారు.

తహసీల్దార్ కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఆయనకు శాలువా కప్పి, పూలమాల వేసి అభినందనలు తెలిపారు. ప్రభుత్వ సేవలను ప్రజలకు సమర్థవంతంగా అందించడంలో, మండల అభివృద్ధిలో ఆయన చేస్తున్న కృషిని ప్రశంసించారు

ఈ సందర్భంగా తహసీల్దార్ కార్తీక్ కుమార్ మాట్లాడుతూ తనకు వచ్చిన అవార్డు తన ఒక్కడిది కాదని, సిబ్బంది అందరి సహకారంతోనే సాధ్యమైందని తెలిపారు. భవిష్యత్తులో కూడా ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందిస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, వివిధ సంఘాల నాయకులు, అధికారులు పాల్గొన్నారు.

SRI SAILAM, KALWAKURTHY

SRI SAILAM, KALWAKURTHY

Next Story