Veldanda: కంటోనీపల్లిలో కనులపండువగా ఆంజనేయస్వామి శోభాయాత్ర

Veldanda: వెల్దండ మండలం కంటోనీపల్లిలో 54వ సప్తంగా వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. భక్తిశ్రద్ధలతో ఆంజనేయస్వామి శోభాయాత్ర నిర్వహించారు.

SRI SAILAM, KALWAKURTHY
Published on: 7 Sept 2026 8:10 PM IST
Veldanda
X

Veldanda: కంటోనీపల్లిలో కనులపండువగా ఆంజనేయస్వామి శోభాయాత్ర

వెల్దండ: మండలంలోని కంటోనీపల్లి గ్రామంలో 54వ సప్తంగా వేడుకలు భక్తిశ్రద్ధలతో ఘనంగా కొనసాగుతున్నాయి. గత మూడు రోజులుగా గ్రామ సర్పంచ్ మమత–లక్ష్మణస్వామి ఆధ్వర్యంలో గ్రామ భక్త బృందం, భజనపరులు, ప్రజల సహకారంతో వేడుకలను కనులపండువగా నిర్వహిస్తున్నారు.

వేడుకల్లో భాగంగా ఆంజనేయస్వామి శోభాయాత్రను శోభాయమానంగా నిర్వహించారు. భజన బృందాల కీర్తనలు, భక్తుల జయజయధ్వానాలతో గ్రామ వీధులు ఆధ్యాత్మిక వాతావరణాన్ని సంతరించుకున్నాయి. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు ప్రత్యేక రతంలో తిరుగుతున్న స్వామివారికి మహిళలు మంగళహారతులతో స్వాగతం పలికి ఆంజనేయస్వామిని దర్శించు కున్నారు నిర్వహిస్తున్.

గ్రామ ప్రజలు భక్తిశ్రద్ధలతో వేడుకల్లో పాల్గొంటూ కార్యక్రమాన్ని విజయవంతం నిర్వహించారు నిర్వాహకులు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేశారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ శివ మధుసూదన్ రవి సురేష్ బాలస్వామి ఆకుల శ్రీను తోపాటు గ్రామ వార్డు సభ్యులు గ్రామ ప్రజలు భక్త బృందం గ్రామస్తులు ఉన్నారు.

SRI SAILAM, KALWAKURTHY

SRI SAILAM, KALWAKURTHY

Next Story