Kalwakurthy: కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డికి మంత్రి పదవి ఇవ్వాలి!

Kalwakurthy: కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డికి మంత్రి పదవి ఇవ్వాలని వెల్దండ మండల కాంగ్రెస్ అధ్యక్షుడు హరికిషన్ నాయక్ డిమాండ్ చేశారు.

SRI SAILAM, KALWAKURTHY
Published on: 1 Sept 2026 12:43 PM IST
Kalwakurthy
X

Kalwakurthy: కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డికి మంత్రి పదవి ఇవ్వాలి!

Kalwakurthy: నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డికి రాష్ట్ర మంత్రివర్గంలో చోటు కల్పించాలని వెల్దండ మండల కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు మూడావత్‌ హరికిషన్‌ నాయక్‌ కోరారు. మంగళవారం మండల కాంగ్రెస్‌ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. నియోజకవర్గ అభివృద్ధికి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి నిరంతరం కృషి చేస్తున్నారని అన్నారు.

ప్రజా సమస్యల పరిష్కారానికి అందుబాటులో ఉంటూ, ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజలకు చేరువ చేసేందుకు కృషి చేస్తున్న ఎమ్మెల్యేకు మంత్రి పదవి లభిస్తే కల్వకుర్తి నియోజకవర్గం మరింత అభివృద్ధి చెందుతుందని పేర్కొన్నారు. పార్టీ బలోపేతానికి, ప్రజల సంక్షేమానికి ఆయన చేస్తున్న కృషిని గుర్తించి మంత్రి పదవి ఇవ్వాలని పార్టీ అధిష్ఠానాన్ని కోరారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్‌ పార్టీ నాయకులు,ఈ కార్యక్రమంలో. సర్పంచ్ అన్వర్ పాషా యువజన కాంగ్రెస్ మాజీ మండల అధ్యక్షులు శ్రీనివాస్ యాదవ్ నాయకులు తిరుపతిరెడ్డి శ్రీనివాస్ మాజీ సర్పంచ్ రామచంద్రయ్య లాలూనాయక్ తోపాటు కార్యకర్తలుతదితరులు ఉన్నారు

SRI SAILAM, KALWAKURTHY

SRI SAILAM, KALWAKURTHY

Next Story