Veldanda: నేడు కాంగ్రెస్ నియోజకవర్గ స్థాయి బీఎల్ఏల విస్తృత సమావేశం

Veldanda: వెల్దండ మండల కేంద్రంలోని తోడేటి చెన్నారెడ్డి గార్డెన్స్‌లో నియోజకవర్గ స్థాయి బీఎల్ఏలతో కాంగ్రెస్ విస్తృత సమావేశం నిర్వహించనున్నట్లు పార్టీ మండల అధ్యక్షుడు హరి కిషన్ నాయక్ తెలిపారు.

SRI SAILAM, KALWAKURTHY
Published on: 24 Aug 2026 9:48 PM IST
Veldanda
X

Veldanda: నేడు కాంగ్రెస్ నియోజకవర్గ స్థాయి బీఎల్ఏల విస్తృత సమావేశం

వెల్దండ: నాగర్ కర్నూలు జిల్లా వెల్దండ మండల కేంద్రంలో నేడు మంగళవారం 25న ఉదయం 10:00 గంటలకు వెల్దండ మండలంలోని తోడేటి చెన్నారెడ్డి గార్డెన్స్ లో నియోజకవర్గ స్థాయి బీఎల్ఏతో విస్తృత సమావేశం నిర్వహించడం జరుగుతుందని వెల్దండ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు హరి కిషన్ నాయక్ ఓ ప్రకటనలో పేర్కొన్నారు.

ఈ సమావేశానికి కల్వకుర్తి ఎమ్మెల్యే కశిరెడ్డి నారాయణరెడ్డి , రాచమల్ల సిద్దేశ్వర్ హాజరవుతున్నారని తెలిపారు. నియోజకవర్గంలోని ప్రతి బి.ఎల్.ఎ విధిగా సమయానికి హాజరుకావాలని కోరారు.అలాగే జిల్లా స్థాయి నాయకులు మరియు మండల స్థాయి ముఖ్య నాయకులు హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు.

SRI SAILAM, KALWAKURTHY

SRI SAILAM, KALWAKURTHY

Next Story