Nagarkurnool: ఘోర ప్రమాదం..గుర్తుతెలియని కారు ఢీకొని భార్యాభర్తలకు తీవ్ర గాయాలు!
Nagarkurnool: నాగర్ కర్నూలు జిల్లా వెల్దండ పరిధిలోని హైదరాబాద్-శ్రీశైలం రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.
Nagarkurnool: ఘోర ప్రమాదం..గుర్తుతెలియని కారు ఢీకొని భార్యాభర్తలకు తీవ్ర గాయాలు!
నాగర్ కర్నూల్ జిల్లా: వెల్దండ మండలం హైదరాబాద్ - శ్రీశైలం ప్రధాన రహదారిపై గుర్తుతెలియని కారు ఢీకొని భార్యాభర్తలు తీవ్రంగా గాయపడ్డారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం చౌదర్ పల్లి గ్రామానికి చెందిన జలగం శివరాజు అతని భార్య పద్మ ఇద్దరు తమ యొక్క ద్విచక్ర వాహనంపై శనివారం రాత్రి 08:00 గంటల సమయంలో ఎన్నమ్స్ హాస్పిటల్ లో పాము కాటుకు గురై చికిత్స పొందుతున్న వారి బంధువును పరామర్శించడానికి వెళుతూ ఆస్పత్రి ముందు రోడ్డు దాటుతుండగా వెల్దండ నుంచి కల్వకుర్తి వైపు వెళ్తున్న గుర్తు తెలియని కారు ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టడం జరిగింది.
దీంతో భార్య, భర్తలకు తలకు కాళ్లకు తీవ్ర గాయాలయ్యాయి.ప్రమాద బాధితుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు గుర్తుతెలియని కారు డ్రైవర్ పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై యుగంధర్ రెడ్డి తెలిపారు.




