Talakondapally: ఆపదలో ఉన్న కుటుంబానికి కాసు ఆర్థిక సహాయం

Talakondapally: రంగారెడ్డి జిల్లా అంతారంలో మృతి చెందిన మల్లయ్య కుటుంబాన్ని కాంగ్రెస్ మండలాధ్యక్షుడు కాసు శ్రీనివాస్ రెడ్డి పరామర్శించి, ఆర్థిక సాయం అందించారు.

SRI SAILAM, KALWAKURTHY
Published on: 8 Aug 2026 11:11 AM IST
Talakondapally
X

Talakondapally: ఆపదలో ఉన్న కుటుంబానికి కాసు ఆర్థిక సహాయం

ఆపదలో అండగా... బాధలో భరోసాగా... మరణించిన కుటుంబానికి ఆర్థిక సహాయం అందించిన తలకొండపల్లి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు

రంగారెడ్డి జిల్లా: తలకొండపల్లి మండలం, అంతారం గ్రామానికి చెందిన ఎనుముల మల్లయ్య అనారోగ్యంతో మృతి చెందిన విషయం తెలుసుకున్న తలకొండపల్లి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కాసు శ్రీనివాస్ రెడ్డి మృతుని కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ తమ వంతు సహాయంగా *రూ.4,000/-*లను కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల చేతుల మీదుగా అందజేశారు.

ఈ సందర్భంగా కుటుంబ సభ్యులకు ధైర్యం చెబుతూ, ఇలాంటి క్లిష్ట సమయంలో కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడూ ప్రజల పక్షాన నిలుస్తుందని తెలిపారు.

ఈ కార్యక్రమంలో గ్రామ కాంగ్రెస్ అధ్యక్షులు రాములు గౌడ్, భాగం మహేష్, అసిఫ్, భవాని, బాలయ్య, బైరపాక ఎల్లయ్య, ఇంద్రకంటి సాయిలు గౌడ్, ఎం.డి. ఇస్మాయిల్, బుడ్డ మహేష్ తదితర కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

SRI SAILAM, KALWAKURTHY

SRI SAILAM, KALWAKURTHY

Next Story