Veldanda: బర్కత్‌పల్లిలో ఘనంగా పెద్దమ్మ తల్లి విగ్రహ ప్రతిష్ఠాపన!
Veldanda: వెల్దండ మండలం బర్కత్‌పల్లిలో శ్రీ పెద్దమ్మ తల్లి విగ్రహ ప్రతిష్ఠాపన మహోత్సవంలో ఐక్యత ఫౌండేషన్ చైర్మన్ సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డి పాల్గొన్నారు.
Veldanda: బర్కత్‌పల్లిలో ఘనంగా పెద్దమ్మ తల్లి విగ్రహ ప్రతిష్ఠాపన!
వెల్దండ: వెల్దండ మండలం, బర్కత్‌పల్లి గ్రామంలో శ్రీ పెద్దమ్మ తల్లి విగ్రహ ప్రతిష్ఠాపన మహోత్సవ కార్యక్రమాన్ని గ్రామ ప్రజలు, ఆలయ నిర్వాహకులు భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు.. ఈ పవిత్ర కార్యక్రమానికి ఐక్యత ఫౌండేషన్ చైర్మన్, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు & TASK C.O.O సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డి. హాజరై అమ్మవారి ప్రతిష్టాపన అనంతరం శ్రీ పెద్దమ్మ తల్లిని దర్శించుకుని పూజ కార్యక్రమంలో పాల్గొని,తీర్థ ప్రసాదాలు స్వీకరించారు.
ఈ సందర్భంగా సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డి మాట్లాడుతూ శ్రీ పెద్దమ్మ తల్లి ఆశీస్సులు బర్కత్‌పల్లి గ్రామ ప్రజలపై ఎల్లప్పుడూ ఉండాలని, గ్రామంలో ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో జీవించాలని ఆకాంక్షించారు,భక్తి, ఆధ్యాత్మికతతో నిర్వహించే ఇలాంటి కార్యక్రమాలు ప్రజల్లో ఐక్యత, సోదరభావాన్ని మరింత పెంపొందిస్తాయని అన్నారు. విగ్రహ ప్రతిష్ఠాపన మహోత్సవాన్ని విజయవంతంగా నిర్వహించిన ఆలయ నిర్వాహకులు, కమిటీ సభ్యులు, గ్రామ పెద్దలు మరియు భక్తులకు ఆయన అభినందనలు తెలిపారు,అలాగే ఆలయ అభివృద్ధికి తన వంతు తోడ్పాటును అందించేందుకు ఎల్లప్పుడూ ఉంటుందని తెలియజేశారు.
ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు మాట్లాడుతూ తమ ఆహ్వానం మేరకు అమ్మవారి విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవ కార్యక్రమానికి విచ్చేసిన సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డి కృతజ్ఞతలు తెలుపుతూ అమ్మవారి ఆశీస్సులతో గొప్ప స్థానాలకు చేరుకోవాలని కోరుకుంటున్నామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో. ఆలయ కమిటీ చైర్మన్ పర్వతాలు,ఉప సర్పంచ్ నరసింహ,సీనియర్ నాయకులు బొజ్జయ్య, అల్లాజీ,కొండల్, లింగం,మల్లేష్,శ్రీశైలం, ఐక్యత ఫౌండేషన్ సభ్యులు రాజు, జంగయ్య,కొండల్ యాదవ్, చంద్ర శేఖర్ ఆలయ నిర్వాహకులు,గ్రామ పెద్దలు,యువత,తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.




