Lingala: పండుగల సాయన్న విగ్రహాన్ని తొలగించొద్దు బీఆర్‌ఎస్!

Lingala: లింగాలలో బహుజన వీరుడు పండుగల సాయన్న విగ్రహ తొలగింపును ఆపాలని, యథాస్థానంలోనే కొనసాగించాలని బీఆర్‌ఎస్ అధికార ప్రతినిధి జంగిలి నిరంజన్ డిమాండ్ చేశారు.

SRI SAILAM, KALWAKURTHY
Published on: 7 Aug 2026 1:33 PM IST
Lingala
X

Lingala: పండుగల సాయన్న విగ్రహాన్ని తొలగించొద్దు బీఆర్‌ఎస్!

Lingala: నాగర్‌కర్నూల్ జిల్లా అచ్చంపేట నియోజకవర్గం లింగాల మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన బహుజన వీరుడు పండుగల సాయన్న విగ్రహాన్ని తొలగించకుండా యథాస్థానంలోనే కొనసాగించాలని, విగ్రహాన్ని మరో ప్రాంతానికి తరలించే ప్రయత్నాలను అధికారులు వెంటనే విరమించుకోవాలని వెల్దండ మండల కేంద్రంలో బీఆర్‌ఎస్ పార్టీ అధికార ప్రతినిధి జంగిలి నిరంజన్ డిమాండ్ చేశారు.

శుక్రవారం మండల కేంద్రంలోని బీఆర్‌ఎస్ పార్టీ స్థానిక నాయకులతో కలిసి జంగిలి నిరంజన్ విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పండుగల సాయన్న ప్రజల కోసం పోరాడిన ధీరుడిగా, పేదలు మరియు బడుగు బలహీన వర్గాల ప్రజలకు అండగా నిలిచిన వ్యక్తిగా ప్రజల మనసుల్లో చిరస్థాయిలో నిలిచిపోయారని, అలాంటి చారిత్రక వ్యక్తి విగ్రహాన్ని తొలగించడం సరికాదని పేర్కొన్నారు.

పండుగల సాయన్న చరిత్ర, ఆయన పోరాట స్ఫూర్తిని భవిష్యత్ తరాలకు తెలియజేయాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. విగ్రహాన్ని తరలించడం ద్వారా ప్రజల మనోభావాలను దెబ్బతీయవద్దని అధికారులను కోరారు. ప్రజల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుని విగ్రహాన్ని ప్రస్తుతం ఉన్న ప్రదేశంలోనే కొనసాగించేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో ఎస్సి సెల్ మండల అధ్యక్షులు కొమ్ము నాగయ్య, జంగిలి ప్రసాద్, పోలె అంజయ్య,చంద్ర శేఖర్, అంజి మాస్టర్,గోరటి అశోక్, తిరుపతి రెడ్డి, సాయి బాబు,కొమ్ము లక్ష్మయ్య, తదితరులున్నారు.

SRI SAILAM, KALWAKURTHY

SRI SAILAM, KALWAKURTHY

Next Story