Devarakadra: దేవరకద్రలో విశ్వహిందూ పరిషత్ ఆధ్వర్యంలో రక్షాబంధన్ వేడుకలు

Devarakadra: దేవరకద్ర పలు పాఠశాలలు, కళాశాలల్లో విశ్వహిందూ పరిషత్ (VHP) ఆధ్వర్యంలో రక్షాబంధన్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. విద్యార్థులకు సనాతన ధర్మంపై అవగాహన.

K. RAGUVEER KUMAR, DEVARAKADRA
Published on: 27 Aug 2026 5:10 PM IST
Devarakadra
X

Devarakadra: దేవరకద్రలో విశ్వహిందూ పరిషత్ ఆధ్వర్యంలో రక్షాబంధన్ వేడుకలు

Devarakadra: రక్షాబంధన్ సందర్భంగా గురువారం రోజు దేవరకద్ర విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో జరిగిన రక్షాబంధన్ వేడుకల్లో మండలంలోని పలు గ్రామాల్లోని పాఠశాలల్లో , మున్సిపాల్టీ కేంద్రంలోని డిగ్రీ కళాశాల ,జూనియర్ కళాశాల,బాయ్స్ స్కూల్స్, గర్ల్స్ స్కూల్ లో విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో కార్యకర్తలు చంద్రయ్య సుధాకర్ రెడ్డి, రామకృష్ణ, శ్రీనివాసులు, మహేందర్, ఆంజనేయులు పాల్గొని విద్యార్థులందరిచే ఒకరితో ఒకరికి రాఖీలు కట్టించారు.

విద్యార్థులందరూ సోదర భావంతో, ప్రేమతో , సంతోషంగా ఒకరికి ఒకరు నేను నీకు రక్ష, నీవు నాకు రక్ష అని శుభా కాంక్షలు తెలుపుకున్నారు. విద్యార్థుల ఉద్దేశించి విశ్వహిందూ పరిషత్ సభ్యులు మాట్లాడుతూ,సోదరి సోదర భావనను ప్రేమను వ్యక్తం చేస్తూ దేశభక్తి, దైవభక్తి కలిగి ఉండాలని సనాతన ధర్మాన్ని కాపాడాలని విద్యార్థులకు తెలియజేశారు.

K. RAGUVEER KUMAR, DEVARAKADRA

K. RAGUVEER KUMAR, DEVARAKADRA

Next Story