Gadwal: గద్వాలకు చేరుకున్న ‘RAGA FOR RISE OF INDIA’ పాదయాత్ర!

Gadwal: కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు ఒంగోలు నాయకుడు వెంకటేష్ చేపట్టిన ‘RAGA FOR RISE OF INDIA’ పాదయాత్ర గద్వాల చేరుకుంది.

GOKARANNA,  GADWAL
Published on: 29 Aug 2026 2:16 PM IST
Gadwal
X

Gadwal: గద్వాలకు చేరుకున్న ‘RAGA FOR RISE OF INDIA’ పాదయాత్ర!

Gadwal: గద్వాల జిల్లా కేంద్రం గద్వాల పట్టణానికి ‘RAGA FOR RISE OF INDIA’ పాదయాత్ర చేరుకుంది. దేశ సమగ్రత, అభివృద్ధి, ప్రగతిని లక్ష్యంగా చేసుకుని ఒంగోలు కాంగ్రెస్ నాయకుడు, హైకోర్టు అడ్వకేట్ వెంకటేష్ కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు చేపట్టిన ఈ సుదీర్ఘ పాదయాత్ర 71వ రోజుకు చేరుకుంది. గద్వాల ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం నుంచి కొనసాగిన పాదయాత్రలో గద్వాల ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి పాల్గొని యాత్రకు సంపూర్ణ మద్దతు తెలిపారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ఏఐసీసీ నాయకుడు రాహుల్ గాంధీని ప్రధానమంత్రిని చేయడమే లక్ష్యంగా, దేశంలోని యువతను చైతన్యపరిచేందుకు వెంకటేష్ చేపట్టిన ఈ సాహసోపేత పాదయాత్ర అభినందనీయమన్నారు. దేశంలో మార్పు కోసం ఒక వ్యక్తిగా ముందుకు వచ్చి యువతను సమాయత్తం చేస్తూ ఇంత సుదీర్ఘ పాదయాత్ర చేపట్టడం గొప్ప విషయమని పేర్కొన్నారు. రాబోయే రోజుల్లో అన్ని రాష్ట్రాల యువత ఈ యాత్రకు మద్దతుగా కదిలి రావాలని ఎమ్మెల్యే పిలుపునిచ్చారు.

GOKARANNA,  GADWAL

GOKARANNA, GADWAL

Next Story