Devarakadra: దేవరకద్రలో ప్రతి సోమవారం ప్రజావాణి: ఎంపీడీవో!

Devarakadra: దేవరకద్ర మండల కేంద్రంలో ప్రజా సమస్యల పరిష్కారం కోసం ప్రతి సోమవారం ప్రజావాణి నిర్వహించనున్నట్లు ఎంపీడీవో శ్రీనివాస్ రావు తెలిపారు.

GOKARANNA,  GADWAL
Published on: 16 Aug 2026 4:33 PM IST
Devarakadra
X

Devarakadra: దేవరకద్రలో ప్రతి సోమవారం ప్రజావాణి: ఎంపీడీవో!

దేవరకద్ర: ప్రజా సమస్యలను పరిష్కరించడానికి ప్రతి సోమవారం ప్రజావాణి కార్యక్రమం ఉంటుందని మండల ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని తెలిపిన దేవరకద్ర ఎంపీడీవో. ప్రభుత్వ ఉత్తర్వు నెంబర్ 4 తేదీ 04.08.2026 ఆదేశాల ప్రకారం, ప్రజా సమస్యల పరిష్కారం కొరకు ప్రతి సోమవారం "ప్రజావాణి" కార్యక్రమం నిర్వహించబడుతుంది.

తేదీ 17.08.26 నుండి ప్రారంభమవుతుంది. సమయం: ఉదయం 10:00 గంటల నుండి మధ్యాహ్నం 1:00 గంట వరకు మండల పరిషత్ మీటింగ్ హాల్ దేవరకద్ర లో మీ అర్జీలు, ఫిర్యాదులు మరియు సమస్యలను నేరుగా సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి వేగవంతమైన పరిష్కారం పొందడానికి ఈ అవకాశాన్ని వినియోగించుకోవాల్సిందిగా కోరారు. ఇట్టి ప్రజావాణికి మండల స్థాయిలో 24 శాఖలకు సంబంధించిన మండల స్థాయి అధికారులు హాజరవుతారని. ఎంపిడిఓ శ్రీనివాస్ రావు తెలిపారు.

GOKARANNA,  GADWAL

GOKARANNA, GADWAL

Next Story