Veldanda: బిడ్డకు తల్లిపాలే అమృతం.. అంగన్‌వాడీ కేంద్రాల్లో అవగాహన సదస్సు
Veldanda: చెరుకూరు సెక్టార్ పరిధిలోని అంగన్‌వాడీ కేంద్రాల్లో ప్రపంచ తల్లిపాల వారోత్సవాల సందర్భంగా గర్భిణీలు, బాలింతలకు ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు.
Veldanda: బిడ్డకు తల్లిపాలే అమృతం.. అంగన్‌వాడీ కేంద్రాల్లో అవగాహన సదస్సు
వెలుదండ: ప్రపంచ తల్లిపాల వారోత్సవం (Aug 1 to 7) సందర్భంగా cherukur sector నాగర్ కర్నూలు జిల్లా వెల్దండ మండలం పలు గ్రామాలలో అంగన్‌వాడీ కేంద్రాల్లో అవగాహన కార్యక్రమాలు.
ప్రపంచ తల్లిపాల వారోత్సవం సందర్భంగా అంగన్‌వాడీ కేంద్రంలో గర్భిణీలు (ముఖ్యంగా మూడో త్రైమాసికంలో ఉన్నవారు), బాలింతలు, వారి కుటుంబ సభ్యులు మరియు భర్తలతో అవగాహన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా శిశువు పుట్టిన వెంటనే తల్లిపాలు ప్రారంభించడం, మొదటి ఆరు నెలలు కేవలం తల్లిపాలు మాత్రమే ఇవ్వడం, ఆరు నెలల తర్వాత అనుబంధ ఆహారంతో పాటు రెండేళ్లు లేదా అంతకంటే ఎక్కువ కాలం తల్లిపాలు కొనసాగించడం వల్ల కలిగే ప్రయోజనాలపై వివరించారు.
కుటుంబ సభ్యులు, ముఖ్యంగా భర్తలు తల్లికి ఇంటిలో సహకరించాలని పిలుపునిచ్చారు. అదేవిధంగా ఈ వర్షాకాలం కావున చేతులు సరిగ్గా కడుక్కోవడం, వ్యక్తిగత పరిశుభ్రతపై అవగాహన నిర్వహించారు.
స్వయం సహాయక సంగాలు షెడ్యూల్ ప్రకారం ఆశా, ఏఎన్‌ఎం తదితర సిబ్బందితో కలిసి ఇంటింటి సందర్శనలు నిర్వహిస్తూ, కుటుంబ సభ్యులు ముఖ్యంగా పురుషులు తల్లి–శిశు సంరక్షణలో భాగస్వాములు కావాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సూపర్వైజర్ సరిత. Teachers ప్రమీల. Chinni. vijaya. Chandrakala. Laxmi మరియు పంచాయతీ సెక్రటరీ లు ఆ శ కార్యకర్త లు పాల్గొన్నారు.




