Veldanda: వెల్లివిరిసిన సోదరభావం.. అక్షర స్కూల్‌లో రక్షాబంధన్!
Veldanda: వెల్దండ మండల కేంద్రంలోని అక్షర కాన్సెప్ట్ పాఠశాలలో రాఖీ పండుగ వేడుకలను ప్రిన్సిపాల్ కే. జార్జ్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.
Veldanda: వెల్లివిరిసిన సోదరభావం.. అక్షర స్కూల్‌లో రక్షాబంధన్!
నాగర్ కర్నూల్ జిల్లా వెల్దండ ఆగస్టు 27: వెల్దండ మండల కేంద్రంలోని అక్షర కాన్సెప్ట్ పాఠశాలలో ప్రిన్సిపల్ కే జార్జ్ ఆధ్వర్యంలో రాఖీ పండుగ వేడుకలను అంగరంగ వైభవంగా నిర్వహించారు.ఉపాధ్యాయులు,విద్యార్థులు ఒకరికొకరు రాఖీలు కట్టుకొని సోదర భావాన్ని చాటుకున్నారు.
ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ మాట్లాడుతూ.. రాఖీ పండుగ అన్నా చెల్లెలు మధ్య ప్రేమ ఆప్యాయత అనుబంధానికి ప్రతీక అని పేర్కొన్నారు. విద్యార్థులు రాఖీలు కట్టుకొని పండుగ శుభాకాంక్షలు తెలియజేసుకున్నారు. ఆహ్లాదకరమైన ఈ వాతావరణం లో జరిగిన ఈ వేడుకల్లో విద్యార్థులు సుమారుగా 380 మంది విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు.
ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు యాదయ్య, పీటర్, ఆనంద్ మరియు ఉపాధ్యాయురాలు రాణి, ప్రేమలత, స్వాతి శశిరేఖ,సాయి ప్రసన్న, శోభ, సంధ్య, సునీత, రూపవతి, మౌనిక తదితరులు పాల్గొన్నారు.




