Veldanda: చేర్కూర్ గ్రామంలో చేయూత పెన్షన్ల పరిశీలన
Veldanda: వెల్డండ మండలం చేర్కూర్ గ్రామంలో చేయూత పెన్షన్ల తనిఖీ నిర్వహించిన స్పెషల్ ఆఫీసర్ మాల్యా నాయక్, సర్పంచ్ బచ్చలకూర శ్రీనివాసులు.
Veldanda: చేర్కూర్ గ్రామంలో చేయూత పెన్షన్ల పరిశీలన
వెల్డండ: వెల్డండ మండలంలో చేయూత పెన్షన్ల పరిశీలనలో భాగంగా స్పెషల్ ఆఫీసర్ ఇరిగేషన్ ఏఈ మాల్యా నాయక్ చేర్కూర్ గ్రామపంచాయతీలో తనిఖీ నిర్వహించారు, గ్రామంలో ఇంటింటికి తిరిగి లబ్ధిదారుల వివరాలు స్వయంగా పరిశీలించారు.
పత్రాలను తనిఖీ చేశారు స్పెషల్ ఆఫీసర్ మాల్యా నాయక్ తో పాటు సర్పంచ్ బచ్చలకూర శ్రీనివాసులు ఉన్నారు, ఈ సందర్భంగా సర్పంచ్ శ్రీనివాసులు మాట్లాడుతూ అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ పెన్షన్ అందాలి.
అనర్హులకు ఒక్క రూపాయి కూడా వెళ్లకూడదని సర్పంచ్ శ్రీనివాసులు సూచించారు అలాగే అవినీతికి తావు లేకుండా పేదలకు న్యాయం జరిగేలా చూడాలని ఆఫీసర్లను కోరారు.
ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ కొండలు, గ్రామ పంచాయతీ కార్యదర్శి బాలరాజు, వార్డు మెంబర్లు పురుగుల రమేష్, సామ కుమారస్వామి, గొడుగు యాదయ్య తదితరులు పాల్గొన్నారు.




