Nagarkurnool: డిండి ప్రాజెక్టును అడ్డుకొని తీరుతాం జేఏసీ చైర్మన్!

Nagarkurnool: నాగర్‌కర్నూల్‌లో జేఏసీ ఆధ్వర్యంలో సత్యాగ్రహ దీక్ష. పాలమూరు నీటిని డిండికి తరలిస్తే మరో ఉద్యమం తప్పదని జేఏసీ చైర్మన్ రాజేందర్ రెడ్డి హెచ్చరిక.

GUNTI SAILU SAGAR, NAGAR KURNOOL
Published on: 12 Sept 2026 7:15 PM IST
Nagarkurnool
X

Nagarkurnool: డిండి ప్రాజెక్టును అడ్డుకొని తీరుతాం జేఏసీ చైర్మన్!

Nagarkurnool: ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా రైతులు, ప్రజల సాగునీటి హక్కులు ప్రయోజనాలకు భంగం కలిగించే డిండి ఎత్తిపోతల పథకం కోసం తెలంగాణ ఉద్యమ స్ఫూర్తితో పోరాటాలకు సన్నద్ధం కావాలని ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా పెండింగ్ ప్రాజెక్టుల సాధన జేఏసీ చైర్మన్ రాజేందర్ రెడ్డి పిలుపునిచ్చారు. శనివారం జేఏసీ నాయకులు ముసలి శ్యామ్ ప్రసాద్ రెడ్డి అధ్యక్షతన నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలోని గాంధీ పార్క్ ఆవరణలో ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోని పెండింగ్ ప్రాజెక్టులను వెంటనే పూర్తి చేయాలని, పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం నుంచి కొత్తగా డిండి ఎత్తిపోతల పథకానికి నీటి తరలింపును నిరసిస్తూ ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా పెండింగ్ ప్రాజెక్టుల సాధన జేఏసీ ఆధ్వర్యంలో ఒకరోజు

సత్యాగ్రహ దీక్షను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా జేఏసీ చైర్మన్ రాజేందర్ రెడ్డి మాట్లాడుతూ ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా రైతులను ప్రజలను చైతన్యవంతులను చేసి ఉమ్మడి జిల్లాకు జరిగిన జరుగుతున్న అన్యాయాలపై చైతన్యవంతులను చేసి ఉమ్మడి జిల్లా హక్కులను సాధించే విధంగా పోరాటాలు సాగిస్తామని రాజేందర్ రెడ్డి అన్నారు. పాలమూరు రైతుల హక్కులకు భంగం కలిగించే చర్యలను మానుకోవాలని లేనియెడల మరో ఉద్యమానికి సిద్ధమవుతామన్నారు.

పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును నీరు గారిచేందుకే డిండి ఎత్తిపోతల పథకాన్ని తెరపైకి తెచ్చి పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలకు సంబంధం లేని కొత్త పథకం డిండిని జోడించడం తగదన్నారు. ఇప్పటికే పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి 35 వేల కోట్లు ఖర్చు చేసినట్టు ప్రభుత్వాలు చెబుతున్న ఇప్పటివరకు 30 ఎకరాలకు కూడా సాగునీరు ఇవ్వలేదని ఆయన ఆరోపించారు. ఎదుల రిజర్వాయర్ నుంచి ఢిల్లీకి నీటిని తరలించడానికి సొరంగం నిర్మించడానికి ప్రభుత్వం సన్నద్ధమైందని దీనిని విరమించుకోవాలని డిమాండ్ చేస్తున్నామన్నారు.

పాలమూరు ప్రజల హక్కులకు భంగం కలిగించే డిండి లాంటి పథకాలను ముందుకు తీసుకొని వస్తే తెలంగాణ ఉద్యమ స్ఫూర్తితో సాగునీటి హక్కులను కాపాడుకోవడానికి ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా ప్రజలు సమాయత్తమవుతారని ఈ సందర్భంగా హెచ్చరించారు. డిండి ఎత్తిపోతల అంటే మహబూబ్నగర్ జిల్లాకు దక్కాల్సిన నీటి హక్కులలో నల్లగొండ జిల్లా జల దోపిడీకి పాల్పడినట్లేనని ఆయన అభివర్ణించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఉమ్మడి జిల్లాకు అన్యాయం జరిగిందని మరో మారు ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో నల్గొండ రూపంలో సాగునీటి విషయంలో కళ్ళముందే అన్యాయం జరుగుతున్న పాలకులు నోరు మెదపడం లేదని ఆరోపించారు. తెలంగాణ ఉద్యమ సమయంలో రైతు జేఏసీలు ఉద్యోగ జేఏసీలు ఉపాధ్యాయ జేఏసీలు యువజన జేఏసీలు రైతు కూలీ జేఏసీలు వంటివి ఏర్పాటు చేసి తెలంగాణ రాష్ట్ర సాధనకు ఎంత నిష్టతో పోరాటం సాగించాము అదే స్ఫూర్తితో ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాకు జరుగుతున్న జలదోపిడిని అడ్డుకోవడానికి కొత్తగా అన్ని జేఏసీలను ఏర్పాటు చేసి అయినా కృష్ణా నీటి హక్కులను సాధించి ఉమ్మడి జిల్లాను సస్యశ్యామలం చేసుకునేందుకు మరో ఉద్యమాన్ని నిర్మిస్తామని రాజేందర్ రెడ్డి అన్నారు.

పార్టీలకు అతీతంగా అందరూ కలిసికట్టుగా పోరాడితేనే సాగునీటి విషయంలో జిల్లాకు అన్యాయం జరగకుండా ఉంటుందని ఆయన పిలుపునిచ్చారు. ఈ నెల 27న కొండా లక్ష్మణ్ బాపూజీ జన్మదినం సందర్భంగా ఉల్పర గ్రామం నుంచి పాదయాత్ర చేయాలని సంకల్పించడం జరిగిందని ఆయన వివరించారు. చేసి వైస్ చైర్మన్ ఏం రాఘవాచారి, ఏ తిమ్మప్ప, ఏ, శ్యాం ప్రసాద్ రెడ్డి, చెన్న కిష్టన్నా, ఎం శంకర్ వెంకట రాములు అంజయ్య చారి వామన్ కుమార్ శేఖర్ రెడ్డి లు మాట్లాడుతూ కృష్ణా జలాలలో తెలంగాణ వాటా మహబూబ్నగర్ జిల్లా హక్కులు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి ఈనాటి వరకు తెలంగాణకు జరుగుతున్న నీటి కష్టాలు నీటి హక్కులు తదితర అంశాలపై సుదీర్ఘంగా ప్రసంగించారు.

ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా కృష్ణా జలాల వినియోగంలో తీవ్రంగా నష్టపోయిందని ఇది అంతా ఉమ్మడి రాష్ట్ర పాలకులు తెలంగాణ రాష్ట్రం సాధించాక అధికారాన్ని అనుభవించిన నాయకుల వల్లే నష్టం జరుగుతుందని పలువురు తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు. జేఏసీ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన సత్యాగ్రహ దీక్షకు సంఘీభావం తెలుపుతూ వివిధ రాజకీయ పార్టీల నాయకులు వివిధ స్వచ్ఛంద సంస్థల బాధ్యులు సాగునీటి విషయంలో ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాకు జరుగుతున్న అన్యాయాల పై జేఏసీ ఏ పిలుపు ఇచ్చిన కలిసి వచ్చి పోరాటాలకు సిద్ధంగా ఉంటామని హామీ ఇచ్చారు.

అదేవిధంగా ఉమ్మడి జిల్లాకు జరుగుతున్న అన్యాయాన్ని ఎదుర్కోవడానికి అన్ని రాజకీయ పార్టీలు కలిసి రావాలని పిలుపునిచ్చారు. ఉదయం 10 గంటలకు ప్రారంభమైన సత్యాగ్రహ దీక్ష సాయంత్రం వరకు వక్తలు మేధావులు సంఘీభావం తెలపడానికి వచ్చిన వివిధ జేఏసీల నాయకులు రాజకీయ పార్టీల నాయకులు తమ అమూల్యమైన సందేశాలతో అనేక సూచనలు సలహాలు ఇస్తూ భవిష్యత్తులో చేపట్టే ఉద్యమానికి స్ఫూర్తిగా నిలిచారని వారికి ఉమ్మడి మహబూబ్నగర్ పెండింగ్ ప్రాజెక్టుల సాధన జేఏసీ కృతజ్ఞతలు తెలుపుతుందని భవిష్యత్తులో చేపట్టే ఉద్యమాలకు కలిసి వచ్చి హక్కులను సాధించుకునే వరకు కలిసి రావాలని పిలుపునిచ్చారు.

ఈ సత్యాగ్రహ దీక్షలో బీఆర్ఎస్ రాష్ట్ర యువ నాయకుడు నాగం శశిధర్ రెడ్డి సంఘీభావం తెలిపారు. సోషలిస్టు పార్టీ ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు నరసింహ గద్వాల జేఏసీ నాయకులు ప్రకాష్ గౌడ్ కే ఎల్ ఐ జేఏసీ నాయకులు రామచంద్రారెడ్డి, జనసేన రాష్ట్ర నాయకులు వంగా లక్ష్మణ్ గౌడ్, శ్రీనివాస్ రెడ్డి నాగయ్య నాయక్ ప్రకాష్ లక్ష్మారెడ్డి సాంబశివుడు హైందవ రెడ్డి లక్ష్మీనారాయణ సదానందం గౌడ్ లక్ష్మీ గుడిపల్లి నిరంజన్ సత్యం సూర్య ప్రకాష్ మధు బేకెం జనార్ధన్, అర్థం రవి రవీంద్రనాథ్ లింగస్వామి లక్ష్మణ్ గౌడ్, రిటైర్డ్ డిప్యూటీ తహసిల్దార్ షేక్ మొహమ్మద్ తదితరులు పాల్గొన్నారు.

GUNTI SAILU SAGAR, NAGAR KURNOOL

GUNTI SAILU SAGAR, NAGAR KURNOOL