Nagarkurnool: మృతుల కుటుంబాలను పరామర్శించి ఆర్థిక సాయం అందజేత!

Nagarkurnool: వెల్దండ మండలంలో మృతి చెందిన వారి కుటుంబాలను రాష్ట్ర ఫుడ్ కమిషన్ చైర్మన్ గోలి శ్రీనివాస్ రెడ్డి పరామర్శించి ఆర్థిక సాయం అందించారు.

SRI SAILAM, KALWAKURTHY
Published on: 29 Aug 2026 12:43 PM IST
Nagarkurnool
X

Nagarkurnool: మృతుల కుటుంబాలను పరామర్శించి ఆర్థిక సాయం అందజేత!

Nagarkurnool: వెల్దండ మండల పరిధిలోని వెల్దండ చెర్కూర్ పెద్దాపూర్ గ్రామాలలో ముగ్గురు వ్యక్తులు చనిపో యారు.శనివారం గోలి శ్రీనివాస్ రెడ్డి మృతుల కుటుంబాలను పరామర్శించి తన ప్రగాఢ సానుభూతి తెలిపారు.అనంతరం పెద్దాపూర్ గ్రామంలో మృతి చెందిన నర్సమ్మకు 5 వేల రూపాయలు అందజేశారు.

అదేవిధంగా వెల్దండ గ్రామంలో మృతి చెందిన పుట్ట శ్రీశైలం కుటుంబానికి 5 వేల రూపాయలు అంద జేశారు.ఈ సందర్బంగా గోలి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ మృత్తుల కుటుంబాలకు భవిష్యత్తులో అండగా ఉంటానని అన్నారు.

కార్యక్రమంలో వెల్దండ బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు, మాజీ ఎంపీపీ పుట్టారామిరెడ్డి, మాజీ ఉప సర్పంచ్ నిరంజన్,మాజీ మండల అధ్యక్షులు జోగయ్య,మాజీ ఎంపీటీసీ జ్యోతినిరంజన్,మాజీ సర్పంచులు అంజి నాయక్, శంకర్ నాయక్,చేర్కూర్ సర్పంచ్

శ్రీనివాసులు,ఉప సర్పంచ్ కొండల్,రాంచంద్రయ్యా,మైసయ్య,లాలయ్య,మాజీ ఉప సర్పంచ్ నర్సింహా,బాలు, బర్కం గణేష్, రాజేందర్,ప్రవీణ్, ఆనంద్,అంజి మాస్టర్,లింగం,ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు.

SRI SAILAM, KALWAKURTHY

SRI SAILAM, KALWAKURTHY

Next Story