Urkonda: ఊర్కొండలో జిల్లా స్థాయి కబడ్డీ జట్ల ఎంపికలు పూర్తి

Urkonda: నాగర్‌కర్నూల్ జిల్లా ఊర్కొండలో నిర్వహించిన కబడ్డీ ఎంపికల్లో 300 మంది క్రీడాకారులు పాల్గొన్నారు. రాష్ట్రస్థాయి పోటీలకు జిల్లా జట్లను ఎంపిక చేశారు.

SRI SAILAM, KALWAKURTHY
Published on: 13 Sept 2026 9:05 PM IST
Urkonda
X

Urkonda: ఊర్కొండలో జిల్లా స్థాయి కబడ్డీ జట్ల ఎంపికలు పూర్తి

నాగర్‌కర్నూల్ జిల్లా: కబడ్డీ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఊర్కొండ మండల కేంద్రంలో ఆదివారం జూనియర్ బాలురు, బాలికలు, సబ్‌జూనియర్ బాలికల జిల్లా కబడ్డీ జట్ల ఎంపికలు నిర్వహించారు. ఈ ఎంపికలను నాగర్‌కర్నూల్ జిల్లా కబడ్డీ అసోసియేషన్ అధ్యక్షుడు జనార్దన్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శి యాదయ్యగౌడ్, గ్రామ సర్పంచ్ మంజుల శ్రీనివాసులు ముఖ్య అతిథులుగా హాజరై ప్రారంభించారు.

జిల్లాలోని 20 మండలాల నుంచి 300 మందికి పైగా క్రీడాకారులు ఎంపికల్లో పాల్గొన్నారు. ప్రతిభ ఆధారంగా ఉత్తమ క్రీడాకారులను జిల్లా జట్లకు ఎంపిక చేశారు. ఈ సందర్భంగా ముచ్చర్ల జనార్దన్‌రెడ్డి మాట్లాడుతూ, గ్రామీణ ప్రాంతాల్లో కబడ్డీ క్రీడకు ఎంతో ఆదరణ ఉందని, క్రీడాకారుల్లో దాగి ఉన్న ప్రతిభను వెలికితీసేందుకు ఇలాంటి జిల్లా స్థాయి ఎంపికలు ఎంతో దోహదపడతాయని అన్నారు.

ఎంపికైన క్రీడాకారులు రాష్ట్రస్థాయి పోటీల్లో ప్రతిభ కనబరిచి నాగర్‌కర్నూల్ జిల్లాకు మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. క్రీడాకారులకు అవసరమైన ప్రోత్సాహం, సహకారం అందించేందుకు కబడ్డీ అసోసియేషన్ కృషి చేస్తుందని తెలిపారు.

ఎంపికైన జూనియర్ బాలురు, సబ్‌జూనియర్ బాలికల జట్లు ఈ నెల 26 నుంచి 29 వరకు సిరిసిల్ల జిల్లాలోని వేములవాడలో నిర్వహించనున్న రాష్ట్రస్థాయి కబడ్డీ ఛాంపియన్‌షిప్‌లో నాగర్‌కర్నూల్ జిల్లా తరఫున పాల్గొంటాయని అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి యాదయ్యగౌడ్ తెలిపారు.

జూనియర్ బాలికల జట్టు వచ్చే నెల 10 నుంచి 13 వరకు ఖమ్మం జిల్లా అశ్వారావుపేటలో జరిగే రాష్ట్రస్థాయి కబడ్డీ ఛాంపియన్‌షిప్‌లో పాల్గొంటుందని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో అసోసియేషన్ సభ్యులు మేకల శ్రీనివాసులు, రమేష్, డాక్టర్ క్యామోహన్, ప్రసాద్, వ్యాయామ ఉపాధ్యాయులు జ్యోతి, భారతి, గణేశ్వరి, సుజాత తదితరులు పాల్గొన్నారు.

SRI SAILAM, KALWAKURTHY

SRI SAILAM, KALWAKURTHY