Charakonda: బత్తోజు కృష్ణమాచారి కుటుంబానికి బీజేపీ నాయకుల ఆర్థిక సాయం

Charakonda: నాగర్ కర్నూల్ జిల్లా చారగొండ మండలం శిరుసనగండ్ల బీజేపీ సీనియర్ నాయకులు బత్తోజు కృష్ణమాచారి దశదిన కర్మ. కుటుంబానికి పరామర్శ, ఆర్థిక సాయం.

SRI SAILAM, KALWAKURTHY
Published on: 8 Aug 2026 5:33 PM IST
Charakonda
X

Charakonda: బత్తోజు కృష్ణమాచారి కుటుంబానికి బీజేపీ నాయకుల ఆర్థిక సాయం

చారగొండ: శిరుసనగండ్ల బీజేపీ సీనియర్ నాయకులు, పార్టీ అభివృద్ధికి కృషి చేసిన శ్రీ బత్తోజు కృష్ణమాచారి గారి దశదిన కర్మ సందర్భంగా బీజేపీ నాయకులు, కార్యకర్తలు ఆయన కుటుంబాన్ని పరామర్శించి ఆర్థిక సహాయం అందజేసి అండగా నిలిచారు.

నాగర్ కర్నూలు జిల్లా చారగొండ మండలం బీజేపీ మాజీ బీసీ కమిషన్ సభ్యులు తల్లోజు ఆచారి కృష్ణమాచారి కుటుంబాన్ని పరామర్శించి ₹10,000 రూపాయలు ఆర్థిక సహాయం అందజేశారు. అలాగే అచ్చంపేట మాజీ శాసనసభ్యులు గువ్వల బాలరాజు ₹5,000 రూపాయలు ఆర్థిక సహాయం అందించారు. అదేవిధంగా శిరుసనగండ్ల బీజేపీ నాయకులు, కార్యకర్తలు కలిసి ₹12,000 రూపాయలు ఆర్థిక సహాయం అందజేశారు

ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. బత్తోజు కృష్ణమాచారి బీజేపీ సిద్ధాంతాల పట్ల నిబద్ధతతో పనిచేసిన సీనియర్ నాయకుడిగా, పార్టీ బలోపేతానికి చేసిన సేవలు చిరస్మరణీయమని అన్నారు. ఆయన లేని లోటు పార్టీకి తీరని లోటని, ఆయన కుటుంబానికి బీజేపీ నాయకులు, కార్యకర్తలు ఎల్లప్పుడూ అండగా ఉంటారని భరోసా ఇచ్చారు.

ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు మొగిళ్ల దుర్గ ప్రసాద్, కల్వకుర్తి వార్డ్ కౌన్సిలర్ బోడ నరసింహ, చారగొండ మండల అధ్యక్షులు చెలమోని కృష్ణ, మండల ఉపాధ్యక్షులు కామోజీ శ్రీకాంత్, వార్డు సభ్యులు ఇరువేంటి వెంకటేశ్వర్లు, ఈర్లపల్లి విష్ణు, పసుల అనూష శ్రీనివాస్, సీనియర్ నాయకులు అంగోతు రవి నాయక్, శ్రీనివాస్ యాదవ్, వెంకట్ చారి, నరేష్ యాదవ్, వాటం యాదగిరి, తదితర బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

SRI SAILAM, KALWAKURTHY

SRI SAILAM, KALWAKURTHY

Next Story