Pebbair: బస్టాండ్‌లో సీసీ బెడ్ పనులకు శ్రీకారం మున్సిపల్ చైర్మన్ శ్రీనివాస్

Pebbair: పెబ్బేరు మున్సిపల్ బస్టాండ్ ఆవరణలో రూ. 39.67 లక్షలతో సీసీ బెడ్ నిర్మాణ పనులను ప్రారంభించిన మున్సిపల్ చైర్మన్ అక్కి శ్రీనివాస్ గౌడ్.

G. BALAVARDHAN, PEBBERU
Published on: 24 Aug 2026 12:38 PM IST
Pebbair
X

Pebbair: బస్టాండ్‌లో సీసీ బెడ్ పనులకు శ్రీకారం మున్సిపల్ చైర్మన్ శ్రీనివాస్

Pebbair: స్థానిక పురపాలక సంఘం పరిధిలోని ప్రధాన బస్టాండు ఆవరణలో చేపడుతున్న సీసీ బెడ్ నిర్మాణ పనులకు మున్సిపల్ చైర్మన్ అక్కి శ్రీనివాస్ గౌడ్ సోమవారం ప్రత్యేక పూజలు నిర్వహించి, టెంకాయ కొట్టి అధికారికంగా ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బస్టాండు ఆవరణలో ఎత్తుపల్లాలు, గుంతల కారణంగా వర్షాకాలంలో నీరు నిలిచిపోయి ప్రయాణికులు, బస్సు డ్రైవర్లు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. పట్టణ ప్రజలు, ప్రయాణికుల కష్టాలను స్థానిక ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి దృష్టికి తీసుకుపోగా రూ, 39 లక్షల 67 వేలతో సీసీ బెడ్ నిర్మాణాన్ని చేపట్టినట్లు వివరించారు.

ఈ నిర్మాణ పనుల్లో ఎలాంటి నాణ్యతా లోపాలు లేకుండా నిబంధనల ప్రకారం పనులు చేపట్టాలని కాంట్రాక్టర్లకు, అధికారులకు సూచించారు. ప్రయాణికులకు ఇబ్బందులు కలగకుండా పనులను వేగవంతం చేసి, నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని ఆదేశించారు.

ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ ప్రమోదిని,మున్సిపల్ వైస్ చైర్మన్ సుమిత్ర, వైస్ చైర్మన్ విజయ వర్ధన్ రెడ్డి, స్థానిక కౌన్సిలర్లు పర్వీన్ షకీల్, జములమ్మ, శివసాయి, భాగ్యలక్ష్మి శివ, వనపర్తి డిపో మేనేజర్ దేవేందర్ గౌడ్, డిప్యూటీ ఇంజనీర్ జంగయ్య, ఏఈ సంపత్ కుమార్, కాంట్రాక్టర్ కృష్ణ కుమార్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు కొంతం దయాకర్ రెడ్డి, మండల అధ్యక్షుడు రామ్ రెడ్డి, మరియు నాయకులు తదితరులు పాల్గొన్నారు.

G. BALAVARDHAN, PEBBERU

G. BALAVARDHAN, PEBBERU

Next Story