Kalwakurthy: భట్టు కిషన్ రెడ్డి (BKR) జన్మదిన వేడుకలు హాజరైన ఎమ్మెల్యే

Kalwakurthy: కాంగ్రెస్ అధ్యక్షుడు భట్టు కిషన్ రెడ్డి (BKR) జన్మదిన వేడుకలు జరిగాయి,ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి ముఖ్య అతిథిగా హాజరై శుభాకాంక్షలు తెలిపారు.

SRI SAILAM, KALWAKURTHY
Published on: 11 Aug 2026 10:05 AM IST
Kalwakurthy
X

Kalwakurthy: భట్టు కిషన్ రెడ్డి (BKR) జన్మదిన వేడుకలు హాజరైన ఎమ్మెల్యే

Kalwakurthy: మాడుగుల మండల కాంగ్రెస్ అధ్యక్షులు, ఆమనగల్ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ శ్రీ భట్టు కిషన్ రెడ్డి (BKR) గారి జన్మదిన వేడుకలు మాడుగులలోని వాసవి ఫంక్షన్ హాల్‌లో ఘనంగా నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి ముఖ్య అతిథిగా హాజరై కేక్ కట్ చేసి భట్టు కిషన్ రెడ్డి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అభిమానులు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తల జన సందోహం మధ్య వేడుకలు ఉత్సాహంగా జరిగాయి.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి మాట్లాడుతూ.. గత 45 సంవత్సరాలుగా రాజకీయ జీవితాన్ని ప్రజాసేవకు అంకితం చేసిన భట్టు కిషన్ రెడ్డి గారు ప్రజా సమస్యల పరిష్కారంతో పాటు మండల అభివృద్ధికి విశేషంగా కృషి చేస్తున్నారని కొనియాడారు. ప్రజలకు అందుబాటులో ఉంటూ ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలకు సహకరించారని తెలిపారు.

ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొని భట్టు కిషన్ రెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారు విజయ పాల డైరీ చైర్మన్ బొజ్జ సాయి రెడ్డి మాజీ జెడ్పిటిసి ప్రభాకర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు వెంకటేశ్వర్ల గౌడ్ మాజీ జెడ్పిటిసి ప్రభాకర్ రెడ్డి నరసింహ ముదిరాజ్ మాజీ సర్పంచ్ కొండల్ రెడ్డి శ్రీనివాస్ రెడ్డి శేఖర్ గౌడ్ పాండు గౌడ్ సర్పంచులు భాస్కర్ రెడ్డి జగన్ గౌడ్ జైపాల్ నాయక్ తిరుపతి కోటేష్ ఉప సర్పంచులు వార్డు మెంబర్స్ నాయకులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

SRI SAILAM, KALWAKURTHY

SRI SAILAM, KALWAKURTHY

Next Story