Devarakadra: వెయ్యి రోజుల్లో రూ.1000 కోట్లు.. ఎమ్మెల్యే జీఎంఆర్ రికార్డ్!
Devarakadra: దేవరకద్ర అభివృద్ధికి ఎమ్మెల్యే జీఎంఆర్ రూ.1000 కోట్ల నిధులు తెచ్చారని కౌకుంట్ల మండల కాంగ్రెస్ అధ్యక్షుడు రాఘవేందర్ రెడ్డి కొనియాడారు.
Devarakadra: వెయ్యి రోజుల్లో రూ.1000 కోట్లు.. ఎమ్మెల్యే జీఎంఆర్ రికార్డ్!
Devarakadra: దేవరకద్ర నియోజకవర్గ అభివృద్ధి కొరకై 1000 రోజుల్లో 1000 కోట్లు అభివృద్ధి పనులు సాధించిన ఘనత మన శాసనసభ్యులు జి మధుసూదన్ రెడ్డి అని కౌకుంట్ల మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాఘవేందర్ రెడ్డి గురువారం రోజు కౌకుంట్లలో నిర్వహించిన కౌకుంట్ల అడ్డాకుల మండలాల ముఖ్య పార్టీ నాయకులతో నిర్వహించిన మీడియా సమావేశంలో తెలిపారు.
ఈ ప్రాంత ప్రజలు, కౌకుంట్ల, ఇస్రంపల్లి, పెద్ద ముంగల్చేడ్, రాచాల, రేకులంపల్లి, వెంకంపల్లి ఎంతో మంది పాలకులకు విన్నవించిన కూడా మంజూరు కానీ అభివృద్ధి పనులు ఈ రోజు మన ప్రియతమ నాయకులు దేవరకద్ర శాసనసభ్యులు జి.మధుసూదన్ రెడ్డి కృషి వలన చిరకాల వాంఛ అయిన.
NH-44 నుంచి ఇస్రంపల్లి, పెద్ద మునగాల చెడ్ మీదుగా కౌకుంట్ల వరకు రహదారి అభివృద్ధి, HLB నిర్మాణానికి రూ.35 కోట్లు కేటాయించారు. వెంకంపల్లి –రేకులంపల్లి మార్గంలో బ్రిడ్జికి రూ.1 కోటి 80 లక్షలు. దేవరకద్ర–ఆత్మకూర్ PWD రోడ్డులో కౌకుంట్ల–రాచాల, ఇస్రాంపల్లి వద్ద బ్రిడ్జికి రూ.5 కోట్ల 40 లక్షలు.
ప్రజల రాకపోకల సమస్యలను పరిష్కరించడంతో పాటు, వర్షాకాలంలో రాకపోకలకు ఇబ్బందులు ప్రాణ నష్టం, పశువుల నష్టం జరగడంతో పాటు విద్యుత్ స్తంభాలు, మోటార్లు, పైప్లైన్లు కొట్టుకుపోయిన ఘటనలు కూడా ఎదురయ్యే ప్రాంతాల్లో శాశ్వత పరిష్కారం కల్పించాలనే లక్ష్యంతో దేవరకద్ర ఎమ్మెల్యే జి. మధుసూదన్ రెడ్డి ప్రత్యేక చొరవ తీసుకుని ఆయా పనుల అవసరాలను రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి పలుమార్లు తీసుకెళ్లడంతో ప్రభుత్వం స్పందించి, నిధులు మంజూరు చేయడం జరిగిందని తెలిపారు.
సీఎం రేవంత్ రెడ్డి ని మరియు పంచాయతీరాజ్ మినిస్టర్ సీతక్క ని కలిసి ఇట్టి అభివృద్ధి పనులు మంజూరు చేయించినందుకు అన్నకి మొట్టమొదటిగా కౌకుంట్ల మరియు అడ్డాకుల మండలాల, గ్రామాల కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల తరఫున ధన్యవాదములు తెలియజేస్తున్నామన్నారు.
పదేళ్లు పరిపాలించిన బీ ఆర్ ఎస్ నాయకులు ఇచ్చిన హామీలు మన రెండున్నర సంవత్సరాలలో చేసిన హామీలు చర్చకు పెడితే తెలుస్తుందని అన్నారు. ప్రజలకు వాళ్లు 420 అని తెలిసే వారికి అధికారాన్ని దూరం పెట్టి ప్రజలు కాంగ్రెస్ పార్టీకి పట్టంకట్టడం జరిగిందన్నారు. అనంతరం బాణాసంచా కాల్చి సంబరాలు జరుపుకున్నారు.
ఈ కార్యక్రమంలో పిసిసి ఆర్గనైజింగ్ సెక్రటరీ అరవింద్ కుమార్ రెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి కిషన్ రావు, అడ్డాకుల మండల పార్టీ అధ్యక్షులు శ్రీహరి, కౌకుంట్ల గ్రామ సర్పంచ్ ఉల్లి నరేష్ కుమార్, అడ్డాకుల గ్రామ సర్పంచ్ దశరథ్ రెడ్డి, విజయ్ మోహన్ రెడ్డి, వేగనాద్, మండల మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు శకుంతల, ఓబీసీ అధ్యక్షులు ఆంజనేయులు, కురుమూర్తి దేవస్థానం మాజీ చైర్మన్ గోవర్ధన్ రెడ్డి, ముచ్చింతల సర్పంచ్ వెంకటేశ్వర్ రెడ్డి అన్ని గ్రామాల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, సర్పంచులు, నాయకులు, కార్యకర్తలు ప్రజలు తదితరులు పాల్గొన్నారు.




