Kalwakurthy: కల్వకుర్తిలో వైభవంగా 'విశ్వశాంతి మహాయాగం'

Kalwakurthy: కల్వకుర్తిలో 91వ విశ్వశాంతి మహాయాగంలో మంత్రి జూపల్లి కృష్ణారావు, ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణ రెడ్డి దంపతులు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.

SRI SAILAM, KALWAKURTHY
Published on: 25 July 2026 4:46 PM IST
Kalwakurthy
X

Kalwakurthy: కల్వకుర్తిలో వైభవంగా 'విశ్వశాంతి మహాయాగం'

Kalwakurthy: నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తి నియోజకవర్గం విశ్వశాంతి మహాయాగ మహోత్సవంలో పాల్గొన్న రాష్ట్ర మంత్రి జూపల్లి కృష్ణారావు , కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణ రెడ్డి దంపతులు కల్వకుర్తి పట్టణంలోని బీఎస్‌ఎన్‌ఎల్ గ్రౌండ్‌లో వైభవంగా నిర్వహిస్తున్న శ్రీ కృష్ణ కాలచక్రం – విష్ణు పంచాయతనం అయుత చండీ అతిరుద్ర మహాయాగం,

శ్రీ సీతారామ సామ్రాజ్య పట్టాభిషేకం, చతుర్వేద పూర్వక మహాగణపతి, మహాసార, సుదర్శన, లక్ష్మీనారాయణ సమేత శ్రీమద్భాగవత 91వ విశ్వశాంతి మహాయాగ మహోత్సవంలో రాష్ట్ర ఎక్సైజ్, పర్యాటక, సాంస్కృతిక శాఖల మంత్రి జూపల్లి కృష్ణారావు , కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణ రెడ్డి , కసిరెడ్డి మాధవి జాతీయ బిసి మాజీ కమిషన్ సభ్యులు ఆచారి పొల్యూషన్ బోర్డు సభ్యులు బాలాజీ సింగ్ భక్తిశ్రద్ధలతో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.

ఈ సందర్భంగా యాగశాలలో వేద పండితులు వేదమంత్రోచ్ఛారణల మధ్య అతిథులకు పూర్ణకుంభ స్వాగతం పలికి, స్వామీజీ వారి ఆశీర్వచనాలు అందజేశారు. అనంతరం రాష్ట్ర ప్రజల సుఖశాంతులు, సమృద్ధి, వర్షాభివృద్ధి మరియు దేశ సంక్షేమం కోసం నిర్వహిస్తున్న మహాయాగంలో ప్రత్యేక పూజలు నిర్వహించి ఆశీర్వాదాలు పొందారు.

ఈ మహాయాగాన్ని శ్రీ కృష్ణ పీఠాధిపతి పరమపూజ్య శ్రీశ్రీశ్రీ కృష్ణ జ్యోతి స్వరూపానంద స్వామీజీ వారి ఆధ్వర్యంలో అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నారు.

ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, అధికారులు, వేద పండితులు, భక్తులు మరియు కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

SRI SAILAM, KALWAKURTHY

SRI SAILAM, KALWAKURTHY

Next Story