Pargi: పరిగి గాంధీ చౌక్‌లో వ్యక్తి మృతి బెల్ట్ షాపులపై తీవ్ర ఆగ్రహం!

Pargi: పరిగి గాంధీ చౌక్‌లో వ్యక్తి మృతి. పట్టణంలో ఇష్టారాజ్యంగా బెల్ట్ షాపుల నిర్వహణపై కౌన్సిలర్ తీవ్ర ఆగ్రహం, ఎక్సైజ్ అధికారుల తీరుపై విమర్శలు.

WAZID, PARIGI
Published on: 25 Aug 2026 9:17 AM IST
Pargi
X

Pargi: పరిగి గాంధీ చౌక్‌లో వ్యక్తి మృతి బెల్ట్ షాపులపై తీవ్ర ఆగ్రహం!

Pargi: వికారాబాద్ జిల్లా పరిగిలో బెల్ట్ షాపుల వ్యవహారం మరోసారి చర్చనీయాంశంగా మారింది. పరిగి గాంధీ చౌక్‌లో రోడ్డుపై ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన కలకలం రేపింది. మృతుడిని చిగురలపల్లి గ్రామానికి చెందిన ముస్తఫాగా గుర్తించారు.

రాత్రి మద్యం సేవించిన అనంతరం ముస్తఫా రోడ్డుపై పడిపోయినట్లు సమాచారం. ఉదయం వాకింగ్‌కు వెళ్తున్న కౌన్సిలర్ మీది గడ్డ శ్రీనివాస్ ఆయనను గమనించి పరిశీలించగా, అప్పటికే మృతి చెందినట్లు గుర్తించారు. ఈ ఘటనపై కౌన్సిలర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పరిగిలో బెల్ట్ షాపుల నిర్వహణపై అధికారుల పర్యవేక్షణ ఎక్కడంటూ ప్రశ్నించారు.

రాత్రి 1 గంట వరకు మద్యం విక్రయాలు జరుగుతున్నాయని, తెల్లవారుజామున 3 గంటలకే మళ్లీ షాపులు తెరుస్తున్నారని కౌన్సిలర్ ఆరోపించారు. అంతేకాదు పరిగిలోని హనుమాన్ టెంపుల్ సమీపంలో నిత్యం మద్యం విక్రయాలు జరుగుతున్నాయని ఆయన ఆరోపించారు.

బెల్ట్ షాపుల కారణంగా ఎన్నో కుటుంబాలు రోడ్డున పడుతున్నాయని, ఇలాంటి విక్రయాలపై ఎక్సైజ్ శాఖ అధికారులు ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని కౌన్సిలర్ ప్రశ్నించారు.

పోలీసుల కళ్ల ముందే బెల్ట్ షాపుల దందా జరుగుతోందని ఆరోపణలు వస్తున్నా అధికారులు ఎందుకు పట్టించుకోవడం లేదనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. అధికారుల నిర్లక్ష్యానికి ఇంకెన్ని కుటుంబాలు బలికావాలి? పరిగిలో బెల్ట్ షాపులపై ఇకనైనా అధికారులు ఉక్కుపాదం మోపుతారా?

మద్యం విక్రయాలపై కఠిన చర్యలు తీసుకుంటారా? అన్నది వేచి చూడాలి.

WAZID, PARIGI

WAZID, PARIGI

Next Story