Makthal: మహిళపై అత్యాచారం కేసులో ఇద్దరు నిందితుల అరెస్ట్ - డీఎస్పీ మహేష్

Makthal: మక్తల్ పోలీస్ స్టేషన్ పరిధిలో 53 ఏళ్ల మహిళపై జరిగిన అత్యాచారం కేసులో ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు డీఎస్పీ మహేష్ వెల్లడించారు.

B. NARENDER, MAKTHAL
Published on: 28 Aug 2026 8:08 PM IST
Makthal
X

Makthal: మహిళపై అత్యాచారం కేసులో ఇద్దరు నిందితుల అరెస్ట్ - డీఎస్పీ మహేష్

మక్తల్: మక్తల్ పోలీస్ స్టేషన్ పరిధిలో 53 ఏళ్ల మహిళపై జరిగిన అత్యాచారం కేసులో పోలీసులు వేగంగా దర్యాప్తు చేపట్టి ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు డీఎస్పీ మహేష్ తెలిపారు.

ఈ ఘటనపై మక్తల్ పోలీస్ స్టేషన్లో డిఎస్పి మహేష్ పత్రిక సమావేశం ఏర్పాటు చేసి నిందితుని వివరాలు వెల్లడించారు. మహిళపై జరిగిన అత్యాచారం కేసులో మక్తల్ పోలీస్ స్టేషన్‌లో FIR No.342/2026, సెక్షన్ 70(1) BNS కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఘటన సమాచారం అందిన వెంటనే పోలీసులు స్పందించి బాధితురాలిని రక్షించి మక్తల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి వైద్య చికిత్స అందించారు. మహిళా ఎస్‌ఐ బాధితురాలి వాంగ్మూలాన్ని నమోదు చేశారు.

జిల్లా ఎస్పీ డాక్టర్ వినీత్ IPS ఆదేశాల మేరకు పోలీసులు దర్యాప్తును వేగవంతం చేసి నిందితులను గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. నిందితులైన వారు మక్తల్ చెందిన *బోయ అరవింద్ (19), బోయ విజయ్ (19)*లను అరెస్ట్ చేసి, కేసుకు సంబంధించిన తదుపరి చట్టపరమైన ప్రక్రియలో భాగంగా రిమాండ్‌కు తరలించినట్లు డీఎస్పీ మహేష్ తెలిపారు.

కేసును త్వరగా ఛేదించి నిందితులను అరెస్ట్ చేయడంలో కృషి చేసిన మక్తల్ సీఐ రామ్లాల్, ఎస్సై రాజుతో పాటు పోలీస్ సిబ్బందిని డీఎస్పీ మహేష్ అభినందించారు.

ఈ సందర్భంగా డీఎస్పీ మహేష్ మాట్లాడుతూ... మహిళలపై నేరాలకు పాల్పడే వారిపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. మహిళల భద్రతకు నారాయణపేట జిల్లా పోలీస్ శాఖ అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని తెలిపారు. బాధితురాలికి అవసరమైన పోలీసు సహాయం అందిస్తామని పేర్కొన్నారు. కేసులో తదుపరి దర్యాప్తు మరియు చట్టపరమైన చర్యలు కొనసాగుతున్నాయని డీఎస్పీ తెలిపారు.

B. NARENDER, MAKTHAL

B. NARENDER, MAKTHAL

Next Story