Makthal: మక్తల్‌లో అక్రమ కోళ్ల పందేలపై పోలీసుల దాడి – ముగ్గురు అరెస్ట్

Makthal: మక్తల్ స్టేషన్ పరిధిలోని చిట్యాల గ్రామ శివారులో కోళ్ల పందేలు నిర్వహిస్తున్న ముగ్గురు వ్యక్తుల అరెస్ట్. నగదు, బైకులు, కోళ్లు స్వాధీనం చేసుకున్న పోలీసులు.

B. NARENDER, MAKTHAL
Published on: 8 Aug 2026 9:58 PM IST
Makthal
X

Makthal: మక్తల్‌లో అక్రమ కోళ్ల పందేలపై పోలీసుల దాడి – ముగ్గురు అరెస్ట్

మక్తల్: మక్తల్ స్టేషన్ పరిధిలోని చిట్యాల గ్రామ శివారులో అక్రమంగా కోళ్ల పందేలు నిర్వహిస్తున్న ముగ్గురు వ్యక్తులను మక్తల్ పోలీసులు పట్టుకున్నారు. విశ్వసనీయ సమాచారం మేరకు మక్తల్ పోలీసులు చిట్యాల గ్రామ శివారులో తనిఖీలు నిర్వహించగా, అక్కడ అక్రమంగా కోళ్ల పందేలు నిర్వహిస్తున్న 03 మంది వ్యక్తులు పట్టుబడ్డారు.

ఈ సందర్భంగా వారి వద్ద నుండి 05 కోళ్లు, 02 మొబైల్ ఫోన్లు, 06 ద్విచక్ర వాహనాలు మరియు రూ.4,150/- నగదు స్వాధీనం చేసుకున్నారు.

స్వాధీనం చేసుకున్న వస్తువులు:

కోళ్లు – 05

మొబైల్ ఫోన్లు – 02

ద్విచక్ర వాహనాలు – 06

నగదు – రూ.4,150/-

అక్రమంగా కోళ్ల పందేలు నిర్వహించడం ద్వారా ప్రజలను జూదం వైపు ప్రోత్సహించడంతో పాటు శాంతిభద్రతలకు విఘాతం కలిగే అవకాశం ఉన్నందున, ఇటువంటి చట్టవిరుద్ధ కార్యకలాపాలపై పోలీసులు నిరంతరం నిఘా కొనసాగిస్తున్నారు.

చట్టవిరుద్ధంగా కోళ్ల పందేలు, జూదం లేదా ఇతర అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వారిపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని పి. రాజు SIP మక్తల్ గారు హెచ్చరించారు.

ప్రజలు తమ పరిసర ప్రాంతాల్లో ఇలాంటి అక్రమ కార్యకలాపాలు జరుగుతున్నట్లు గుర్తించినట్లయితే వెంటనే పోలీసులకు సమాచారం అందించి, శాంతిభద్రతల పరిరక్షణలో పోలీసులకు సహకరించాలని కోరారు.

B. NARENDER, MAKTHAL

B. NARENDER, MAKTHAL

Next Story