Devarakadra: పెద్ద గోప్లాపూర్ వద్ద ఘోర ప్రమాదం!

Devarakadra: దేవరకద్ర మండలం పెద్ద గోప్లాపూర్ వద్ద లారీ, డీసీఎం, పెళ్లి బస్సు ఢీకొని ఘోర ప్రమాదం. లారీ డ్రైవర్ మృతి.

K. RAGUVEER KUMAR, DEVARAKADRA
Published on: 6 May 2026 2:03 PM IST
Devarakadra
X

Devarakadra: పెద్ద గోప్లాపూర్ వద్ద ఘోర ప్రమాదం!

Devarakadra: లారీ, డీసీఎం, బస్సు ఢీకొని ఒక వ్యక్తి మృతి చెందిన సంఘటన దేవరకద్ర మున్సిపాలిటీ పరిధిలో చోటుచేసుకుంది. దేవరకద్ర ఎస్ఐ నాగన్న తెలిపిన వివరాల ప్రకారం దేవరకద్ర మున్సిపాలిటీ పరిధిలోని పెద్దగోప్లాపూర్ మలుపు వద్ద రాయచూర్ 167 వ జాతీయ రహదారిపై ఉన్న స్పీడ్ బ్రేకర్ల దగ్గర రాత్రి మూడు గంటల సమయంలో హైదరాబాద్ నుండి సిందనూర్ కు ట్రాన్స్పోర్ట్ లోడుతో వెళ్తున్న డీసీఎంను వెనక నుండి వేగంగా వస్తున్న లారీ డీసీఎంను అతివేగంగా వెనుక నుంచి ఢీకొనడంతో ఎదురుగా వస్తున్న ( రైయిచూర్ నుండి హైదరాబాద్) పెళ్లి బస్సు ను ఎదురుగా ఢీకొంది.

దీనితో బస్సులో ప్రయాణిస్తున్న ఇద్దరికీ , డీసీఎం డ్రైవర్ కు గాయాలయ్యాయి. లారీ డీసీఎం వాహనాలు రోడ్డుపై బోల్తాపడ్డాయి లారీ డ్రైవర్ తీవ్ర గాయాలతో లారీలో ఇరుక్కుపోయాడు. వెంటనే స్పందించిన దేవరకద్ర పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని జెసిబి సాయంతో లారీలో ఇరుక్కుపోయిన లారీ డ్రైవర్ను బయటకు తీసి చికిత్స నిమిత్తం అంబులెన్స్ లో జిల్లా ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ లారీ డ్రైవర్ మృతి చెందాడని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు దేవరకద్ర ఎస్సై నాగన్న తెలిపారు. మృతుడు మిడ్జిల్ మండలానికి భాస్కర్ గా గుర్తించిన పోలీసులు.

సంఘటన స్థలాన్ని పరిశీలించిన మంత్రి వాకిటి శ్రీహరి

అదే సమయం లో మక్తల్ కి వెళ్తున్న పశుసంవర్ధక, క్రీడల శాఖ మంత్రి వాకిటి శ్రీహరి సంఘటన స్థలాన్ని పరిశీలించి, డీసీఎం ఓనర్ ను అడిగి వివరాలు తెలుసుకున్నారు. రోడ్డు ప్రమాదాలు జరగకుండా సిగ్నల్స్ ఏర్పాటు చేస్తానని హామీ ఇచ్చారు. రోడ్డుకు అడ్డంగా పడిన వాహనాలను జెసిబి సహాయంతో తొలగించి ట్రాఫిక్ క్లియర్ చేసిన దేవరకద్ర పోలీసులు.

K. RAGUVEER KUMAR, DEVARAKADRA

K. RAGUVEER KUMAR, DEVARAKADRA

Next Story