Devarkadra: కోయిల్ సాగర్ కాలువలకు సాగునీటిని విడుదల చేసిన ఎమ్మెల్యే!
Devarkadra: కోయిల్ సాగర్ ప్రాజెక్టు కాలువలకు సాగునీటిని ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి విడుదల చేశారు. ఆరుతడి పంటలే వేసి నీటిని పొదుపుగా వాడుకోవాలని సూచించారు.
Devarkadra: కోయిల్ సాగర్ కాలువలకు సాగునీటిని విడుదల చేసిన ఎమ్మెల్యే!
Devarkadra: నీటిని పొదుపుగా వాడుకోవాలని ,ఆరుతడి పంటలే వేయాలని ఎమ్మెల్యే జి మధుసూదన్ రెడ్డి అన్నారు. బుధవారం రోజు మహబూబ్ నగర్ జిల్లా కోయిల్ సాగర్ ప్రాజెక్టు కాలువల ద్వారా రైతులకు సాగునీటిని విడుదల చేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఎల్ నినో ప్రభావంతో వర్షాలు పడుకున్నా కూడా పైనుంచి వస్తున్న వరద ద్వారా జూరాల నిండడంతో జూరాల నుండి కోయిల్ సాగర్ ప్రాజెక్టుకు నీటిని ఎత్తిపోస్తూ రైతుల అవసరార్థం ఈరోజు సాగునీటిని విడుదల చేశామని తెలిపారు.
వర్షాభావ పరిస్థితుల వల్ల ఉన్న బోర్లు కూడా ఎండిపోయే పరిస్థితి ఉండడంతో రైతులకు ఇబ్బందులు కలగకూడదని నీటిని విడుదల చేశామని చెరువులు కుంటలు నింపుకోవడం ద్వారా బోర్లు రీఛార్జి అవుతాయని అదేవిధంగా రైతులందరూ కూడా ఉన్న నీటిని పొదుపుగా వాడుకొని ఆరుతడి పంటలను వేయాలని సూచించారు.
ఏడు నుంచి పది రోజుల వరకు నీటి విడుదల ఉంటుందని పైనుంచి వచ్చే వరద దృష్ట్యా ముందు ముందు నీటి విడుదల చేపడతామని ఈ సందర్భంగా తెలిపారు. రైతుల సంక్షేమం కోసమే ప్రజా ప్రభుత్వం పనిచేస్తుందని అన్నారు. పనిలేని ప్రతిపక్షాలు రైతులను అనవసరపు కలవరపాటుకు గురిచేస్తున్నాయని వారి మాయ మాటలు నమ్మి మోసపోవద్దని తెలిపారు.
అడిగిన వెంటనే సామినిటీ విడుదలకు సహకరించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఉత్తంకుమార్ రెడ్డికి రైతులందరి తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నామన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, రైతులు, తదితరులు పాల్గొన్నారు.




