Kalwakurthy: కల్వకుర్తిలో ఎక్సైజ్ వాహనాల వేలం, రూ. 2.47 లక్షల ఆదాయం
Kalwakurthy: నాగర్‌కర్నూల్ జిల్లా కల్వకుర్తిలో ఎక్సైజ్ శాఖ స్వాధీనం చేసుకున్న 13 వాహనాల వేలం. ప్రభుత్వ ఖజానాకు రూ. 2,47,000 ఆదాయం సమకూరిందని అధికారులు వెల్లడి.
Kalwakurthy: కల్వకుర్తిలో ఎక్సైజ్ వాహనాల వేలం, రూ. 2.47 లక్షల ఆదాయం
కల్వకుర్తి: నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తి ఆగస్టు 12 : కల్వకుర్తి పట్టణ కేంద్రంలోని నాగర్ కర్నూల్ ప్రొహిబిషన్ మరియు ఎక్సైజ్ శాఖ జిల్లా అధికారి వేణుగోపాల్ రెడ్డి ఆధ్వర్యంలో బుధవారం ఎక్సైజ్ శాఖ స్వాధీనం చేసుకున్న వాహనాలకు వేలం నిర్వహించారు.
ఈ వాహనాల వేలంలో మొత్తం 13 వాహనాలు వేలంపాట ద్వారా విక్రయించడం జరిగిందని తెలిపారు. దీంతో వేలంపాట ద్వారా ప్రభుత్వ ఖజానాకు రూ. 2 లక్షల 47 వేల రూపాయలు ఆదాయం సమకూరిందని వారు తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఎక్సైజ్ సీఐ వెంకట్ రెడ్డి, సిబ్బంది జంగయ్య, జనార్దన్ రెడ్డి, మునీందర్, సిద్ధార్థ, అనిల్, చంద్రశేఖర్, తేజశ్రీ, సునీతలు పాల్గొన్నారు.
Next Story




