Kadthal: ప్రమాద బాధితుడికి బీసీ సంఘం అధ్యక్షుడు గణేష్ గౌడ్ ఆర్థిక సహాయం!

Kadthal: రంగారెడ్డి జిల్లా కడ్తాల్ మండలంలో రోడ్డు ప్రమాదానికి గురైన రేపని యాదయ్య కుటుంబానికి మండల బీసీ సంఘం అధ్యక్షుడు మాదారం గణేష్ గౌడ్ రూ. 15,000 ఆర్థిక సాయం

SRI SAILAM, KALWAKURTHY
Published on: 25 Aug 2026 5:19 PM IST
Kadthal
X

Kadthal: ప్రమాద బాధితుడికి బీసీ సంఘం అధ్యక్షుడు గణేష్ గౌడ్ ఆర్థిక సహాయం!

Kadthal: రంగారెడ్డి జిల్లా కడ్తాల్ మండలం , ప్రతినిధి ఆగస్టు 25: కడ్తాల్ మండల కేంద్రంలో రేపని యాదయ్య ఇటీవల రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. ఈ విషయం తెలుసుకున్న కడ్తాల్ మండల బిసి సంఘ అధ్యక్షుడు,కడ్తాల్ 9వ వార్డు సభ్యుడు మాదారం గణేష్ గౌడ్ మంగళవారం కుటుంబ సభ్యులను పరామర్శించి తన వంతు బాధ్యతగా యాదయ్య కుటుంబానికి రూ.15 వేల రూపాయలు ఆర్థిక సహాయం అందజేశారు.

కష్టాల్లో ఉన్నవారికి తోడుగా నిలబడటం, అవసరమైన సమయంలో చేయూతనివ్వడం మనిషిగా మన బాధ్యత అని పేర్కొన్నారు.మనం అందించే సహాయం ఎంత చిన్నదైనా… ఆ కుటుంబానికి అది ఎంతో పెద్ద భరోసా ఆపదలో ఉన్నవారికి అండగా నిలిచే చేయి మానవత్వానికి నిజమైన గుర్తింపు అని తెలిపారు.ఈ కార్యక్రమంలో బీసీ సంఘ గౌరవ అధ్యక్షుడు వరి కుప్పల రాజు, హనుమాన్ యూత్ ప్రెసిడెంట్ మహేందర్ రెడ్డి,నార్ల కంటి శేఖర్, చిన్నం వెంకటేష్, శశాంక్ తదితరులు పాల్గొన్నారు.

SRI SAILAM, KALWAKURTHY

SRI SAILAM, KALWAKURTHY

Next Story