Gadwal: విద్యార్థుల వికాసానికి బోధన దోహదపడాలి: గద్వాల కలెక్టర్!
Gadwal: విద్యార్థుల వికాసానికి అనుగుణంగా ఉపాధ్యాయులు ప్రయోగాత్మకంగా, ఏఐ సాంకేతికతతో బోధించాలని జోగుళాంబ గద్వాల కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ సూచించారు.
Gadwal: విద్యార్థుల వికాసానికి బోధన దోహదపడాలి: గద్వాల కలెక్టర్!
గద్వాల్: విద్యార్థుల వికాసానికి చదువు దోహదపడాలంటే పిల్లల మానసిక పరిస్థితులను అర్థం చేసుకుంటూ బోధించాల్సిన అవసరం ఉందని జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ అన్నారు. గురువారం గద్వాలలోని ప్రభుత్వ అభ్యసన ఉన్నత పాఠశాలలో నిర్వహించిన కాంప్లెక్స్ సమావేశంలో కలెక్టర్ పాల్గొని ఉపాధ్యాయులకు తగు సూచనలు చేశారు.
ఎఫ్ఎల్ ఎన్ ప్రాముఖ్యతను ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలని, విద్యకు సంబంధించిన వివిధ అంశాలపై ఇచ్చే శిక్షణ కార్యక్రమాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఉపాధ్యాయులు చిత్తశుద్ధితో పనిచేస్తేనే మెరుగైన ఫలితాలు వస్తాయన్నారు.
విద్యార్థుల్లో సృజనాత్మకత పెరిగేలా ఉపాధ్యాయులు ఆయా సబ్జెక్టులను ప్రయోగపూర్వకంగా బోధనోపకరణాలను తయారుచేసి, ఏఐ వంటి సాంకేతికతను వినియోగించి బోధించాలన్నారు. తరగతి గదిలో విద్యార్థుల ప్రవర్తన, పాఠ్యాంశాలను అర్థం చేసుకునే తీరు గమనిస్తూ ఉండాలని సూచించారు. విద్యార్థుల సామర్ధ్యాలను ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ చదువులో వారు రాణించేలా కృషి చేయాలని ఆదేశించారు.




